బుమ్రా బౌలింగ్‌లో 6 సిక్స్‌లు కొడతాడన్నారు.. కట్ చేస్తే! తొలి బంతికే ఔట్‌ | Asia Cup 2025: Hardhik Pandya dismissed Saim Ayub for a golden duck | Sakshi
Sakshi News home page

Asia Cup 2025: బుమ్రా బౌలింగ్‌లో 6 సిక్స్‌లు కొడతాడన్నారు.. కట్ చేస్తే! తొలి బంతికే ఔట్‌

Sep 14 2025 8:30 PM | Updated on Sep 14 2025 9:17 PM

Asia Cup 2025: Hardhik Pandya dismissed Saim Ayub for a golden duck

ఆసియాక‌ప్‌-2025లో పాకిస్తాన్ యువ ఓపెన‌ర్ సైమ్ అయూబ్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతోంది. ఒమ‌న్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డ‌కౌటైన అయూబ్‌.. ఇప్పుడు దుబాయ్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో అదే తీరును క‌న‌బ‌రిచాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అయూబ్ త‌ను ఎదుర్కొన్న తొలి బంతికే ఔట‌య్యాడు.  

పాక్ ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్ వేసిన పాండ్యా.. మొద‌టి బంతిని ఆఫ్ స్టంప్ దిశ‌గా బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివ‌రీగా సంధించాడు. ఆ బంతిని అయూబ్ ఆఫ్ సైడ్ పాయింట్ దిశ‌గా షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నిచాడు.

అయూబ్ షాట్ అద్బుతంగా క‌న‌క్ట్ చేసిన‌ప్ప‌టికి బంతి మాత్రం నేరుగా బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న జ‌స్ప్రీత్ బుమ్రా చేతికి వెళ్లింది. దీంతో ఒక్క‌సారిగా అయూబ్ తెల్ల‌ముఖం చేశాడు. చేసేదేమిలేక నిరాశ‌తో పెవిలియ‌న్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

అయితే భార‌త్ మ్యాచ్‌కు ముందు అయూబ్‌ను ఉద్దేశించి పాక్ మాజీ ఆట‌గాడు త‌న్వీర్ అహ్మ‌ద్ ఇచ్చిన స్టెట్‌మెంట్ ఇప్పుడు భారత అభిమానులు ప్రస్తావిస్తున్నారు. బుమ్రా బౌలింగ్‌లో అయూబ్ ఆరు సిక్స్‌లు కొడ‌తాడ‌ని అహ్మ‌ద్ బిల్డ‌ప్ ఇచ్చాడు.

దీంతో  అహ్మ‌ద్‌, అయూబ్‌ను క‌లిసి నెటిజ‌న్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. "భార‌త్‌పై క‌నీసం ఒక్క ప‌రుగు చేయ‌లేక‌పోయావు, నీవా బుమ్రా బౌలింగ్‌లో 6 సిక్స్‌లు కొడ‌తావ‌ని" ఓ యూజ‌ర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.

6 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో తొలి వికెట్‌గా అయూబ్ వెనుదిర‌గగా.. జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో మ‌హ్మ‌ద్ హ‌రిస్‌(3) ఔట‌య్యాడు. అయితే వీరిద్ద‌రి ఔట‌య్యాక ఫ‌ఖార్ జ‌మాన్‌(16), సాహిబ్జాదా ఫర్హాన్(19) ఇన్నింగ్స్ చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 6 ఓవ‌ర్లు ముగిసే సారికి పాక్ రెండు వికెట్ల న‌ష్టానికి 42 ప‌రుగులు చేసింది.


చదవండి: IND vs PAK: టాస్‌ గెలిచినా అదే చేసేవాళ్లం: సూర్య!.. తుదిజట్లు ఇవే
 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement