
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సంచలన బంతితో మెరిశాడు. అద్బుతమైన బంతితో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను బుమ్రా బోల్తా కొట్టించాడు. బుమ్రా దెబ్బకు టెస్టు వరల్డ్ నెం1 బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. ఓలీ పోప్ ఔటయ్యాక బ్రూక్ క్రీజులోకి వచ్చాడు.
అప్పటికే క్రీజులో పాతుకుపోయిన జో రూట్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ బుమ్రా అతడికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 55వ ఓవర్ వేసిన బుమ్రా ఐదో బంతిని.. హ్యారీ బ్రూక్‌కు ఆఫ్ స్టంప్ దిశగా సంధించాడు.
140 కి.మీ వేగంతో వేసిన ఆ బంతిని బ్రూక్ ఆఫ్‌సైడ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ కాస్త లోగా వచ్చిన బంతి అతడి బ్యాట్‌ను మిస్స్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. దీంతో బ్రూక్(8) ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న బుమ్రా తిరిగి లార్డ్స్‌లో ఆడుతున్నాడు.
68 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(62), బెన్‌స్టోక్స్(27) ఉన్నారు. భారత బౌలర్లలో ఇప్పటివరకు నితీశ్ కుమార్ రెడ్డి రెండు, జస్ప్రీత్ బుమ్రా, జడేజా తలా వికెట్ సాధించారు.
Number 1 bowler gets Number 1 batter at Lord’s.
What a delivery by Jasprit Bumrah — absolute perfection.⁰Top of off, pace, precision — vintage Bumrah.⁰#INDvsENG #ENGvIND
pic.twitter.com/kdGbLbPnND— Kavya Maran (@Kavya_Maran_SRH) July 10, 2025