
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తన తొలి పర్యటనలోనే ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఓటమి పాలైనప్పటికి.. గిల్ మాత్రం బ్యాటింగ్, కెప్టెన్సీ పరంగా వందకు వంద మార్క్‌లు కొట్టేశాడు.
ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన గిల్.. 607 పరుగులతో లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో గిల్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లాంటి సీనియర్లు లేనప్పటికి గిల్ జట్టును అద్బుతంగా నడిపిస్తున్నాడని గోవర్ కొనియాడాడు.
"రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల వంటి దిగ్గజాల లేకుండా భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వచ్చింది. దీంతో అందరి దృష్టి యువ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌పైనే ఉండేది. కానీ శుబ్‌మన్ మాత్రం అందరి అంచనాలను తారుమారు చేస్తూ తొలి రెండు ఇన్నింగ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
ఒక జట్టుకు నాయకత్వం వహించడానికి 34 ఏళ్ల వయస్సు ఉండనవసరం లేదు. టాలెంట్‌తో పాటు సరైన టెక్నిక్ ఉంటే చాలు 24 ఏళ్లకే కెప్టెన్ అవ్వచ్చు. అని గోవర్ స్పోర్ట్స్ స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అదేవిధంగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌పై కూడా గోవర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
"ఒక బలమైన జట్టును తాయారు చేయడం చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. నాయకుడు ముందుండి జట్టును నడిపిస్తే విజయం సాధించడం పెద్ద కష్టమైన పనికాదు. అందుకు ఊదహరణగా బెన్ స్టోక్స్‌ను తీసుకొవచ్చు. లార్డ్స్‌లో టెస్టులో స్టోక్స్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు.
గత కొన్నాళ్లగా స్టోక్స్ నుంచి ఇటువంటి ప్రదర్శనను మిస్ అయ్యాము. గంటకు 120 కి.మీ వేగంతో బౌలింగ్ చేయడం, పేస్ బౌలింగ్ ఎటాక్‌ను లీడ్ చేయడం వంటి నిజంగా అద్బుతం. స్టోక్సీ నుంచి గిల్ కచ్చితంగా కొన్ని విషయాలను నేర్చుకోవాలి" గోవర్ అన్నారు.
చదవండి: అరంగేట్రానికి సిద్దమవుతున్న కోహ్లి అన్న కొడుకు..