
ఆసియాకప్-2025కు ముందు పాకిస్తాన్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్‌పై భారీ అంచనాలు ఉండేవి. ద్వైపాక్షిక సిరీస్‌లలో అద్బుతంగా రాణిస్తున్న అయూబ్.. ఈ ఖండాంతర టోర్నీలో కూడా దుమ్ములేపుతాడని అంతా భావించారు. కానీ ఈ యువ ఆటగాడు అందరి అంచనాలను తలకిందలు చేశాడు.
ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా దుబాయ్ వేదికగా ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో యూబ్ తీవ్ర నిరాశపరిచాడు. గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో అయూబ్ తన ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. పాక్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన ఒమన్ పేసర్ షా ఫైజల్.. రెండో బంతిని మిడిల్ స్టంప్ దిశగా ఫుల్లర్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు.
ఆ బంతిని అయూబ్ కాస్త బెండ్ అయ్యి లెగ్ సైడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి బ్యాక్ ప్యాడ్‌కు తాకింది. దీంతో బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ వెంటనే ఔట్ అని వేలు పైకెత్తాడు. ఆ తర్వాత అయూబ్ రివ్యూ తీసుకున్నప్పటికి ఫలితం మాత్రం ఒమన్‌కు ఫేవర్‌గానే వచ్చింది.
బంతి క్లియర్‌గా మిడిల్ స్టంప్‌కు తాకినట్లు తేలింది. దీంతో నిరాశతో అయూబ్ పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. తొలి బంతికే ఔటైన అయూబ్ నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు.
ఎందుకంటే పాక్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్.. జస్ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్-పాక్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌లో అయూబ్ ఆరు సిక్స్‌లు కొడతాడని అహ్మద్ బిల్డప్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు అయూబ్ పసికూన ఒమన్‌పై ఆడలేకపోయాడు.
💥 Golden Duck! Saim Ayub trapped plumb LBW, Pakistan lose review early!#AsiaCup2025 #Pakistan #Oman #starzplay pic.twitter.com/cJ74GBVZ7q
— Cricket on STARZPLAY (@starzplaymasala) September 12, 2025