
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడటంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ముగిసిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో తొలి టెస్టు ఆడిన బుమ్రా రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్నాడు.
ఆ తర్వాత మళ్లీ మూడు, నాలుగు టెస్టుల్లో ఆడాడు. ఈ క్రమంలో కీలకమైన ఆఖరి టెస్టుకు బుమ్రా దూరమయ్యాడు. ఐదో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడాన్ని చాలా మంది మాజీలు తప్పుబట్టారు.
వర్క్‌లోడ్ ఉన్నప్పటికి ముఖ్యమైన మ్యాచ్‌కు ఎలా విశ్రాంతి ఇస్తారని, ముందే మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాతాడని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో బుమ్రా తన సహచర పేసర్ భువనేశ్వర్ కుమార్ మద్దతుగా నిలిచాడు. బుమ్రా 5 టెస్టుల్లో మూడు ఆడినా ఎటువంటి సమస్యలేదు అని భువీ అన్నారు.
"జస్ప్రీత్ బుమ్రా గత కొన్ని సంవత్సరాలుగా అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నాడు. ప్రతీ ఫార్మాట్‌లోనూ తన బెస్ట్‌ను ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. మిగితా వారితో పోలిస్తే బుమ్రా బౌలింగ్ యాక్షన్ కాస్త భిన్నంగా ఉంటుంది. అటువంటి యాక్షన్ ఉన్నప్పుడు బుమ్రానే కాదు మరొకరైనా గాయాల బారిన పడొచ్చు. బుమ్రా ఎల్లప్పుడూ క్లిష్టమైన పరిస్థితుల్లో బౌలింగ్ చేస్తాడు.
ఇది అతడిపై మానసిక, శారీరక ఒత్తిడిని కలుగుజేస్తుంది. బుమ్రా లాంటి బౌలర్ సేవలను సుదీర్ఘ కాలం పాటు ఉపయోగించుకోవాలంటే, కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. అతడు ఇంగ్లండ్ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లలో మూడింట మాత్రమే ఆడడం నాకేమి తప్పు అన్పించలేదు.
ఒక ఆటగాడు మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడకపోవచ్చు, కానీ ఆడిన మూడు మ్యాచ్‌లలో తన ప్రభావాన్ని చూపితే చాలు. బుమ్రా కూడా అంతే. ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ తన ఇంపాక్ట్ చూపించాడు" అని పాడ్‌కాస్ట్ టాక్ విత్ మన్వేంద్రకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భువనేశ్వర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 14 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
చదవండి: Independence Day: కోహ్లి అలా.. గంభీర్ ఇలా.. పోస్ట్ వైరల్