
ఆసియాకప్-2025 నిర్వహణపై సందిగ్ధం వీడిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇటీవలే విడుదల చేసింది. ఈ మెగా ఈవెంట్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఆసియా కప్ 2025 జరగనుంది.
వాస్తవానికి ఈ టోర్నీ భారత్ వేదికగా జరగాల్సింది. కానీ భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఈ ఈవెంట్‌ను యూఏఈలో నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. అయితే ఈ ఏడాది ఆసియాకప్‌నకు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయి.
బుమ్రా ప్రస్తుతం ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. వర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్టుకు బుమ్రాకు టీమ్ మెనెజ్‌మెంట్ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో కూడా బుమ్రా అంత ఫిట్‌గా కన్పించలేదు.
దీంతో అతడు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటాడా లేదా ఆసియాకప్‌లో ఆడుతాడా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే ఆసియాకప్‌కు నెల రోజులకు పైగా సమయం ఉండడంతో బుమ్రా తన పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశముంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.
"జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై మరోసారి అనుమానాలు నెలకొన్నాయి. అతడు ఐదో టెస్టులో ఆడకపోతే ఆసియాకప్‌కు కచ్చితంగా అతడు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే అతడికి నెలకు పైగా విశ్రాంతి లభిస్తోంది.
ఈ టోర్నీకి సెలక్టర్లు ఎలాంటి జట్టును ఎంపిక చేస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు మహ్మద్ షమీ కూడా ఆసియాకప్‌నకు దూరంగా ఉండే అవకాశముంది. ఎందుకంటే షమీ ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌తో లేడు. అతడి ఫిట్‌నెస్‌ను పరీక్షించడానికి, ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నద్దం చేసేందుకు టీ20ల్లో ఆడించారు.
కానీ అతడు మెరుగ్గా రాణించలేకపోయాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో కూడా నామమాత్రపు ప్రదర్శన కనబరిచాడు. నావరకు అయితే షమీని భారత టీ20 జట్టులో ఆడించడమే ఆసాధ్యమే అని తన యూట్యూబ్ ఛానల్‌లో చోప్రా పేర్కొన్నాడు.
చదవండి: AUS vs IND: ఆస్ట్రేలియా టూర్‌కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు