భక్తిశ్రద్ధలతో గుడ్‌ ఫ్రైడే | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో గుడ్‌ ఫ్రైడే

Apr 4 2026 7:49 AM | Updated on Apr 4 2026 7:49 AM

కరీంనగర్‌కల్చరల్‌: యేసుక్రీస్తు శిలువ వేయబడిన రోజు గుడ్‌ఫ్రైడేను శుక్రవారం జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. చర్చిల్లో ఆధ్యాత్మిక భావంతో బైబిల్‌ పఠనాలు, ప్రార్థలను, ప్రత్యేక గీతాలు ఆలపించారు. ఉపవాస దీక్షలు విరమించి పేదలకు ఆత్మీయులకు, స్నేహితులకు దాన ధర్మాలు చేశారు. నగరంలోని సీపీ కార్యాలయం వద్ద ఉన్న సీఎస్‌ఐ వెస్లీ కెథిడ్రల్‌ చర్చిలో పాస్టరేట్‌ చైర్మన్‌ పాల్‌ కొమ్మాల్‌ దైవ సందేశమిచ్చారు. సెక్రటరీ సంజయ్‌, ట్రెజరర్‌ ముల్కల సంజయ్‌ పాల్గొన్నారు. క్రిస్టియన్‌కాలనీలోని సీఎస్‌ఐ సెంటినరీ చర్చిలో ఫాస్టరేట్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.జాన్‌ సందేశాన్ని ఇచ్చారు. అసిస్టెంట్‌ ప్రెస్టిటర్‌ రెవ ఎం.పింటు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement