విద్యార్థికి జ్ఞాన కేంద్రంగా ఉండాలి
కరీంనగర్‌టౌన్: మ్యూజియం అంటే కేవలం వస్తు ప్రదర్శనగా ఉండకుండా విద్యార్థికి జ్ఞాన కేంద్రంగా ఉండాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. నగరంలోని జిల్లా సైన్స్ మ్యూజియంలో జరుగుతున్న పునరుద్ధరణ పనులను సోమవారం పరిశీలించారు. మ్యూజియంలో విద్యార్థులకు అవసరమైన సైన్స్, ఆర్ట్ కల్చర్‌కు సంబంధించి మరిన్ని విషయాలు చేర్చాలన్నారు. మ్యూజియంలో ఉన్న ప్రతీ ఎగ్జిబిట్ పూర్తి సమాచారాన్ని ఇచ్చే విధంగా ఉండాలని సూచించారు. మ్యూజియాన్ని సందర్శించిన విద్యార్థి కొంత నేర్చుకొని వెళ్లాలని, ఆ రకంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అనంతరం ప్రశ్నపత్రాల తయారీ కేంద్రాన్ని సందర్శించి ప్రశ్నపత్రాల సెట్టర్స్‌తో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ప్రశ్నాపత్రాలు తయారు చేయాలని సూచించారు. ఆదనపు కలెక్టర్ వెంట జిల్లా సైన్స్ అధికారి చాడ జైపాల్‌రెడ్డి, ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి ఎస్.భగవంతయ్య, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ రవీందర్, స్టేట్ రిసోర్స్‌పర్సన్ గాజుల రవీందర్, ఉమర్ అలీ తదితరులు ఉన్నారు.


