మహిళ కడుపులోంచి ఆరు కిలోల కణితి తొలగింపు
కోరుట్ల: పట్టణా నికి చెందిన 48 ఏ ళ్ల మహిళ కడుపులోంచి 6కిలోల క ణితిని వైద్యులు బుధవారం శస్త్రచి కిత్స చేసి తొలగించారు. మహిళ కడుపు ఉబ్బసం, నొప్పితో స్థానిక వా సుదేవ ఆస్పత్రిలో చేరింది. వైద్యుడు పసునూరి మ నోజ్ కుమార్ పరీక్షలు చేసి, కడుపులో కణితి పెరుగుతున్నట్లు గుర్తించాడు. మహిళ అంగీకారంతో శస్త్రచిక్సిత ద్వారా తొలగించారు. వైద్యులు పసునూరి విజయశ్రీ, ప్రియాంక రాజేశ్ పాల్గొన్నారు.
కత్తితో దాడి.. కేసు నమోదు
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం సోమన్‌పల్లిలో మంగళవారం అర్ధరాత్రి ఇరువర్గాల ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారు. గ్రామస్తుల కథనం మేరకు సోమన్‌పల్లికి చెందిన సాన రాకేశ్‌కు వివాహమై కూతురు ఉంది. అయినా ఓ వివాహితను ఇటీవల ప్రేమపేరుతో తీసుకొచ్చి, పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నా డు. విషయం తెలిసి వివాహిత బంధువులు స్వా మి, సత్తన్నతోపాటు, మరికొందరు సోమన్‌పల్లికి వ చ్చి సాన రాకేశ్‌పై దాడిచేసి వివాహితను తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో రాకేశ్ ఇంట్లో ఉన్న కత్తితో స్వామి, సత్తన్నలపై దాడిచేశాడు. స్థానికులు 108లో జగిత్యాల, ఆ తర్వాత కరీంనగర్‌కు తరలించారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
మహిళ కడుపులోంచి ఆరు కిలోల కణితి తొలగింపు


