చెరువులో దూకి మహిళ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

Feb 19 2026 10:11 AM | Updated on Feb 19 2026 10:11 AM

చెరువ

చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

మల్లాపూర్‌: ఆనారోగ్యంతో తీవ్ర మనస్తాపం చెందిన మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మల్లాపూర్‌ మండలం ముత్యంపేటలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పుల్లూరి నీల(60) భర్త బాలయ్య తొమ్మిదేళ్ల క్రితమే మృతి చెందాడు. కొడుకు, కూతురుకు వివాహాలయ్యాయి. కొడుకు రమేశ్‌ ఉపాధి నిమిత్తం మూడేళ్ల నుంచి కోరుట్లలో నివాసం ఉంటున్నాడు. నీల గ్రామంలో ఒంటరిగా ఉంటోంది. మూడు నెలల క్రితం ఇంట్లోజారి పడిపోవడంతో ఎడమ చేయి విరిగింది. అనారోగ్య సమస్యలతో పాటు ఒంటరితనంతో మానసికంగా బాధపడుతూ.. గ్రామశివారులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై అనిల్‌, సిబ్బందితో ఘటనాస్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతురాలి కుమార్తె చింతల రమ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

పురుగుల మందుతాగి..

జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్‌ మండలం ధరూర్‌ గ్రామానికి చెందిన ఆరెపల్లి చిన్నరాజం(80) బుధవారం ఉదయం పురుగుల మందుతాగగా, చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. చిన్నరాజం తొమ్మిదేళ్ల నుంచి కడుపు నొప్పి, నరాల సమస్యలతో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందుతాగాడు. కుటుంబ సభ్యులు గమనించి జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలోచేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఆరెపల్లి భీమక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్సై ఉమాసాగర్‌ తెలిపారు.

ఉరివేసుకుని వివాహిత..

వేములవాడ: వేములవాడ పట్టణంలోని కోరుట్లరోడ్‌ ప్రాంతానికి చెందిన వెంగళ దివ్య(32) ఉరఫ్‌ రోహిణి బుధవారం ఇంట్లోనే ఉరివేసుకుంది. పట్టణ సీఐ వీరప్రసాద్‌ తెలిపిన వివరాలు. జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలానికి చెందిన దివ్యను పదేళ్ల క్రితం వేములవాడకు చెందిన దినేశ్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు సంతానం. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి బొంగు రాజగంగు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధాల గొడవలు జరుగుతున్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది.

చెరువులో దూకి మహిళ ఆత్మహత్య1
1/2

చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

చెరువులో దూకి మహిళ ఆత్మహత్య2
2/2

చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement