వెళ్లొస్తం రాజన్నా | - | Sakshi
Sakshi News home page

వెళ్లొస్తం రాజన్నా

Feb 17 2026 7:32 AM | Updated on Feb 17 2026 7:32 AM

వెళ్ల

వెళ్లొస్తం రాజన్నా

వెళ్తూ.. రాజన్నకు మొక్కుతున్న భక్తులు

ముల్లెమూటలతో వెళ్తున్న భక్తులు

ముగిసిన రాజన్న మహాజాతర బద్దిపోచమ్మకు బోనం మొక్కులు

తిరుగుబాట పట్టిన భక్తులు రూ.కోటికిపైగా ఆదాయం

వేములవాడ: మహాశివరాత్రి జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. మూడు రోజులపాటు కొనసాగిన శివరాత్రి వేడుకలకు వచ్చిన భక్తులు సోమవారం మధ్యాహ్నం నుంచి తిరిగి ఇంటిబాట పట్టారు. ఆర్టీసీ అధికారులు గుడి చెరువు కట్ట కింద నుంచి బస్సులను నడిపారు.

బద్దిపోచమ్మకు బోనం

మహాశివరాత్రి వేడుకలకు వచ్చిన భక్తులు సోమవారం ఉదయం నుంచే బద్దిపోచమ్మకు బోనం మొక్కులు చెల్లించుకున్నారు. డప్పుచప్పుళ్లతో నృత్యాలు చేస్తూ భక్తులు బోనాలతో తరలివచ్చారు.

ప్రత్యేక ఆకర్షణగా శివార్చన

మహాశివరాత్రి జాతర సందర్భంగా రాష్ట్ర భాష, సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో గుడి చెరువు ఖాళీ స్థలంలో నిర్వహించిన శివార్చన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గుడి చెరువు ఖాళీ ప్రదేశంలో దాదాపు 40 వేలకు పైగా భక్తులు కూర్చుని కార్యక్రమాలు తిలకిస్తూ ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జాగరణ మొక్కులు చెల్లించారు. కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ శివస్తోత్రం గానం చేయడం ఆకట్టుకుంది. జాతర బందోబస్తుకు వచ్చిన ఇతర జిల్లాల పోలీసులను ఎస్పీ మహేశ్‌ బీ గీతే సోమవారం మధ్యాహ్నం రిలీవ్‌ చేశారు. మూడు రోజులపాటు జరిగిన మహాజాతర సక్సెస్‌ కావడంతో కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, ఎస్పీ మహేశ్‌ బీ గీతే, అడిషనల్‌ ఎస్పీ చంద్రయ్య, ఏఎస్పీ రుత్విక్‌సాయి, ఆర్డీవో రాధాభాయి, ఆలయ ఈవో రమాదేవి, సీఐ వీరప్రసాద్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.

రూ.కోటికిపైగా ఆదాయం

రాజన్న మహాజాతర సందర్భంగా ఆది, సోమవారాల్లో దాదాపు 2 లక్షలకు పైగా భక్తులు హాజరయ్యారు. రెండు రోజుల్లో రూ.కోటికిపైగా ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

వెళ్లొస్తం రాజన్నా1
1/1

వెళ్లొస్తం రాజన్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement