ఫుట్‌బాల్‌ విజేత వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్‌ విజేత వరంగల్‌

Feb 17 2026 7:32 AM | Updated on Feb 17 2026 7:32 AM

ఫుట్‌బాల్‌ విజేత వరంగల్‌

ఫుట్‌బాల్‌ విజేత వరంగల్‌

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌ యైటింక్లయిన్‌కాలనీ అబ్దుల్‌ కలాం స్డేడియంలో కాలనీ ఫుట్‌క్లబ్‌ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 16 జట్లు హాజరయ్యాయి. ఫైనల్‌కు చేరిన హుజూరాబాద్‌ జట్టుపై వరంగల్‌ జట్టు రెండు గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. విజేతగా నిలిచిన వరంగల్‌ ఫుట్‌బాల్‌ జట్టు క్రీడాకారులకు నిర్వాహకులు కప్పుతోపాటు రూ.2వేల నగదు బహుమతి అందజేశారు. రన్నర్‌గా నిలిచిన హుజూరాబాద్‌ జట్టుకు కప్పు అందించారు. ఈకార్యక్రమంలో నిర్వాహకులు ఉదయ్‌కుమార్‌, అబ్దుల్‌ రహీం, సునీల్‌ పృథ్వీ, ఆశీష్‌ కుమార్‌, అభిషేక్‌, శివ, నాగేంద్ర, శ్రీనాథ్‌, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement