యువకుడి మృతిపై అనుమానాలు | - | Sakshi
Sakshi News home page

యువకుడి మృతిపై అనుమానాలు

Feb 17 2026 7:32 AM | Updated on Feb 17 2026 7:32 AM

యువకు

యువకుడి మృతిపై అనుమానాలు

● అంతర్జాతీయ క్రీడావేదికపై చెక్కపల్లి వాసి

● పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు

కోనరావుపేట(వేములవాడ): బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్న ఓ యువకుడు మృతిచెందడంతో మృతుని కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన మల్లెవేణి మహేశ్‌(35) ఆదివారం కోనరావుపేటలోని తన సోదరి ఇంటికెళ్లాడు. మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరిన మహేశ్‌ రాత్రి 10 గంటలు దాటినా ఇంటికి చేరుకోలేదు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు రాత్రి పూట వెతుకుతుండగా నిజామాబాద్‌ గ్రామ ఎల్లమ్మ ఆలయ సమీపంలో పొలంలో పడి మృతిచెందినట్లు గుర్తించారు. మహేశ్‌ తన బైక్‌తో చెట్టును ఢీకొని పొలంలో పడడంతో మృతిచెందాడని భావిస్తున్నారు. కోనరావుపేట ఎస్సై ప్రశాంత్‌రెడ్డి సోమవారం పంచనామా చేసి మృతదేహాన్ని సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మహేశ్‌ మృతిపై అనుమానాలు ఉన్నట్లు మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మహేశ్‌కు భార్య లావణ్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

కొత్తపల్లి(కరీంనగర్‌): కరీంనగర్‌లోని మల్కాపూర్‌కు చెందిన జంగ వెంకటయ్య (60) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొత్తపల్లి సీఐ బిల్ల కోటేశ్వర్‌ తెలిపిన వివరాలు.. వెంకటయ్య సోమవారం వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై కొత్తపల్లికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కరీంనగర్‌–జగిత్యాల ప్రధాన రహదారిపై కొత్తపల్లి వద్ద రోడ్డు దాటుతుండగా టాటా ఏస్‌ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

ఫోర్‌ నేషన్‌ టోర్నీలో టీమిండియాకు స్వర్ణం

వేములవాడరూరల్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌ మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారుడు అంతర్జాతీయ క్రీడా వేదికపై తన ప్రతిభను చాటాడు. ఈ నెల 14, 15వ తేదీల్లో దుబాయి వేదికగా నిర్వహించిన ఫోర్‌ నేషన్‌ సెస్టోబాల్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఇందులో క్రీడాకారునిగా చెక్కపల్లికి చెందిన ఎడపెల్లి అనిల్‌ తన ప్రతిభను చూపారు. జట్టు కెప్టెన్‌గా వ్యవహరించి స్వర్ణ పతకాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో భారత జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఫైనల్‌లో స్వర్ణ పతకాన్ని సాధించింది.

యువకుడి మృతిపై అనుమానాలు
1
1/1

యువకుడి మృతిపై అనుమానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement