జేఈఈ మెయిన్స్‌లో ‘అల్ఫోర్స్‌’ ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్స్‌లో ‘అల్ఫోర్స్‌’ ప్రతిభ

Feb 17 2026 7:32 AM | Updated on Feb 17 2026 7:32 AM

జేఈఈ

జేఈఈ మెయిన్స్‌లో ‘అల్ఫోర్స్‌’ ప్రతిభ

వందశాతం పర్సంటైల్‌ లక్ష్యం రెండో దశలో లక్ష్యం సాధిస్తా

కొత్తపల్లి(కరీంనగర్‌): జాతీయస్థాయిలో నిర్వహించిన ఐఐటీ జేఈఈ మెయిన్స్‌లో కరీంనగర్‌లోని అల్ఫోర్స్‌ ఐఐటీ అకాడమీకి చెందిన విద్యార్థులు చవట లక్ష్మీహాసిని, వూట్కూరి శ్రేయాన్స్‌రెడ్డి అత్యున్నత పర్సంటైల్‌ సాధించారు. ఎన్‌టీఏ సోమవారం ప్రకటించిన జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో లక్ష్మీహాసిని 99.94 పర్సంటైల్‌, శ్రేయాన్స్‌రెడ్డి 99.83 పర్సంటైల్‌ సాధించారు.

ఐఐటీ జేఈఈ మెయిన్స్‌లో ప్రస్తుతం సాధించిన పర్సంటైల్‌ సంతృప్తికరమే అయినప్పటికీ 100 శాతం పర్సంటైల్‌ లక్ష్యంగా మరింత సాధన చేస్తా. జాతీయస్థాయి పరీక్షల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అధ్యాపకులు బోధించిన విషయాలను సమగ్రంగా సాధన చేస్తూ విశ్లేషణాత్మకంగా విషయాలపై పట్టు సాధించా. రానున్న రోజుల్లో నిర్వహించే రెండో దశ పరీక్షలో జాతీయస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తా.

– చవట లక్ష్మీహాసిని (99.94 పర్సంటైల్‌)

చక్కటి ప్రణాళిక, అధ్యాపకుల అత్యుత్తమ బోధన ద్వారా ఈ విజయం సాధించా. రెండో దశలోనూ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుని నా లక్ష్యాన్ని సాధిస్తా. ప్రతిష్టాత్మక ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా సన్నద్ధం అవుతున్న. ముఖ్యంగా మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులపై దృష్టి సారించి ప్రాక్టీస్‌ చేశా. వివిధ రకాల పరీక్షలు సైతం రాస్తూ విజయం సాధిస్తున్నా.

– వూట్కూరి శ్రేయాన్స్‌రెడ్డి (99.83 పర్సంటైల్‌)

జేఈఈ మెయిన్స్‌లో ‘అల్ఫోర్స్‌’ ప్రతిభ 1
1/1

జేఈఈ మెయిన్స్‌లో ‘అల్ఫోర్స్‌’ ప్రతిభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement