పైసన్నాటకం..! | - | Sakshi
Sakshi News home page

పైసన్నాటకం..!

Feb 16 2026 7:50 AM | Updated on Feb 16 2026 7:50 AM

పైసన్నాటకం..!

పైసన్నాటకం..!

● ఐదు వార్డుల్లో రూ.కోటిన్నర పైనే ● కోరుట్ల మున్సిపల్‌ ఎన్నికల తీరు..

● ఐదు వార్డుల్లో రూ.కోటిన్నర పైనే ● కోరుట్ల మున్సిపల్‌ ఎన్నికల తీరు..

కోరుట్ల: మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయ పరిమితి నిబంధన ఉత్తదే అయింది. ఎన్నికల అనంతరం అభ్యర్థులు సమర్పించే ఖర్చుల లెక్కలను మాత్రమే పరిగణనలోని తీసుకోవడం ఆనవాయితీగా మారింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు చేసిన అడ్డగోలు ఖర్చుపై ఎన్నికల అఽధికారులు పెట్టిన నిఘా అంతంత మాత్రమే కావడం గమనార్హం. ఫలితంగా కోరుట్ల మున్సిపాల్టీలో ఒక్కో అభ్యర్థి గెలుపు కోసం అనధికారికంగా చేసిన ఖర్చుల లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. రెండవ గ్రేడ్‌ మున్సిపాల్టీల్లో అభ్యర్థుల ఖర్చు రూ. 4 లక్షలుగా నిర్ధారించిన ఎన్నికల సంఘం నిబంధన పట్టించుకున్న వారే లేరు.

ఎంతైనా సరే..తగ్గేదేలే..

కోరుట్ల మున్సిపాల్టీలో మొత్తం 33 వార్డులు ఉండగా సుమారు 250 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎంత తక్కువ అనుకున్నా రూ. 10 లక్షల నుంచి 15 లక్షల మేర ఖర్చు చేశారు. ఈ లెక్కన ప్రతీ వార్డులో పోటీలో ఉన్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖర్చును లెక్కలోని తీసుకుంటే ఒక్కో వార్డుకు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు కనీస ఖర్చు చేశారని ప్రచారం జరుగుతోంది. కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు సైతం తగ్గేదేలే.. అన్న తీరుగా సుమారు రూ.20 లక్షల నుంచి 25 లక్షల మేర ఖర్చు చేశారు. ఈ లెక్కన 33 వార్డుల్లో రూ.15 కోట్ల మేర ఖర్చు జరిగినట్లు అంచనా. ఇవి కాకుండా పట్టణంలోని రసవత్తరమైన పోటీ నెలకొన్న నాలుగు వార్డుల్లో కనీస ఖర్చు రూ.70 లక్షల వరకు ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ నాలుగు వార్డుల్లోనే బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు దాదాపు రూ. 5 కోట్ల మేర ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఒక్క కోరుట్ల మున్సిపాల్టీలోనే ఎన్నికలు ముగిసేసరికి ఎంత తక్కువ అనుకున్నా రూ. 20 కోట్ల మేర ఖర్చు జరగడం నివ్వెరపరుస్తోంది.

మద్యం పారించారు

మున్సిపల్‌ ఎన్నికల బరిలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులు ఎన్నికల్లో మద్యం పంపిణీ చేసేందుకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున కేటాయించడం బహిరంగ రహస్యం. ఈ లెక్కన మొత్తం మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులను లెక్కలోకి తీసుకుంటే మద్యం ఖర్చు రూ.అరకోటి దాటుతుంది. పార్టీలు మద్యం కోసం ఇచ్చిన ఫండ్‌ కాకుండా ప్రతీ వార్డులో పోటీలో ఉన్న అభ్యర్థులు సొంతంగా కనీసం రూ.15 లక్షల మేర మద్యం పంపిణీ చేసినట్లు సమాచారం. ఈ లెక్కన మొత్తం 33 వార్డుల్లో మద్యం కోసం చేసిన ఖర్చు వెరసి రూ.5 కోట్లకు చేరుకుంది. మొత్తం ఖర్చులను పక్కాగా లెక్కలోకి తీసుకుంటే ఒక్క కోరుట్ల మున్సిపాల్టీలోనే రూ.25 కోట్ల మేర అభ్యర్థులు ఖర్చులు చేశారని జోరగా ప్రచారం సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement