డ్రోన్‌ ఉపాధి | - | Sakshi
Sakshi News home page

డ్రోన్‌ ఉపాధి

Feb 12 2026 10:21 AM | Updated on Feb 12 2026 10:21 AM

డ్రోన

డ్రోన్‌ ఉపాధి

ఉద్యోగంలో విసిగిపోయిన

వేములవాడఅర్బన్‌: ఆలోచన ఉంటే ఎక్కడైనా ఉపాధి వెతుక్కోవచ్చని ఈ యువకుడు నిరూపించాడు. డ్రోన్‌ ఆవిష్కరణను తనకు ఉపాధిగా మలుచుకున్నాడు. డ్రోన్‌ సాయంతో మందు పిచికారీ చేస్తూ అటు రైతులకు శ్రమ తగ్గించడంతోపాటు తనకు పక్కా ఉపాధిగా మలుచుకున్నాడు. బోయినపల్లి మండలం నర్సింగాపూర్‌కు చెందిన గంగాధర శ్రీనివాస్‌ డ్రోన్‌తో క్రిమిసంహారక మందు పిచికారీ చేస్తూ నమ్మకమైన ఉపాధి పొందుతున్నాడు.

యాంత్రీకరణతో అనేక మార్పులు

వ్యవసాయం అంటేనే శ్రమతో కూడిన పని. తెల్లారెంది మొదలు రాత్రి పొద్దుపోయే దాక పనిచేసిన ఒడవని కథ. అయితే యాంత్రీకరణతో వ్యవసాయ పనులు తేలికగా మారాయి. ట్రాక్టర్‌ రాకతో దుక్కిదున్నే పని సులభతరమైంది. నాటువేసే యంత్రాలు రావడంతో గంటలోనే ఒక ఎకరం పొలం నాటువేసేస్తుంది. హోర్వెస్టర్‌ ఆవిష్కరణతో వరికోతలు సులభంగా మారిపోయాయి. ఒక్క రోజులోనే ఒకే మిషిన్‌తో దాదాపు పది నుంచి పదిహేను ఎకరాలలో కోత పూర్తయింది. ఈక్రమంలోనే డ్రోన్‌ ఆవిష్కరణ రైతుల శ్రమను మరింత తగ్గించింది. క్రిమిసంహారక మందు పిచికారీ చేయాలంటే నీళ్లు మోసేందుకు ఇద్దరు మనుషులు, డబ్బతో మందు పిచికారీ చేసేందుకు ఒక్క మనిషి అవసరముండేది. ముగ్గురు కలిస్తే రెండు గంటల్లో ఎకరం పొలానికి మందు పిచికారీ చేస్తారు. కానీ డ్రోన్‌ సాయంతో అరగంటలోపే ఎకరం పొలంలో మందు పిచికారీ చేస్తున్నారు. అది కూడా తక్కువ నీటి అవసరంతోనే.

డ్రోన్‌ కొని.. మందుకొట్టి

బోయినపల్లి మండలం నర్సింగాపూర్‌కు చెందిన శ్రీనివాస్‌ పీజీ వరకు చదివాడు. అనంతరం ప్రైవేట్‌ కంపెనీలో 12 ఏళ్లపాటు పనిచేశారు. రైతుబిడ్డ కావడంతో ఎక్కడ ఉద్యోగం చేయడం ఎందుకు కొత్తగా వ్యవసాయంలోనే యంత్రాలతో పనులు చేయాలని ఆలోచనతో ఏడాదిన్నర క్రితం డ్రోన్‌ను కొనుగోలు చేశాడు. ఇందుకు డ్రోన్‌కు రూ.4లక్షలు వెచ్చించాడు. మరో రూ.2 లక్షలు పెట్టి కారు కొన్నాడు. డ్రోన్‌ను కారుపై పెట్టుకొని పొలాల వద్దకు వెళ్లి క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నాడు. ఇటు రైతులకు శ్రమ తప్పడంతోపాటు శ్రీనివాస్‌కు ఉపాధి లభిస్తుంది.

సీజన్‌ వారీగా సంపాదన

సీజన్‌ ఉన్నప్పుడు డ్రోన్‌తో రోజు 20 ఎకరాల వరకు క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నాడు. ఎకరానికి రూ.500 తీసుకుంటున్నాడు. మొదటి సీజన్‌ ఆరు నెలల్లో 400 ఎకరాలు పిచికారీ చేశాడు. రెండో సీజన్‌లో 900 ఎకరాలు.. ఇప్పుడు మూడో సీజన్‌లో 1500 ఎకరాలలో పిచికారీ చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నాడు. డ్రోన్‌లో 10 లీటర్లు నీరు పడుతుంది. అది ఒక ఎకరానికి పిచికారీ చేస్తుంది. డ్రోన్‌తో నీరు తక్కువ మందు ఎక్కువగా పిచికారీ అవుతుంది. సీజన్‌లో మూడు నెలలు ఇదే పనిచేస్తున్నాడు.

ఆధునిక యంత్రాలతో పురుగుమందులు పిచికారీ

రైతులకు తప్పిన తిప్పలు యువకుడికి పక్కా ఉపాధి

ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించిన. నోటిఫికేషన్‌లు రాకపోవడంతో 12 ఏళ్లు ప్రైవేట్‌ కంపెనీలో పనిచేసిన. విసిగిపోయి ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం ఇష్టం లేక సొంతంగా డ్రోన్‌ కోనుగోలు చేసిన. దీంతో సంతోషంగా పని చేసుకుంటున్నాను.

– గంగాధర శ్రీనివాస్‌, నర్సింగాపూర్‌

డ్రోన్‌ ఉపాధి1
1/3

డ్రోన్‌ ఉపాధి

డ్రోన్‌ ఉపాధి2
2/3

డ్రోన్‌ ఉపాధి

డ్రోన్‌ ఉపాధి3
3/3

డ్రోన్‌ ఉపాధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement