● ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ | - | Sakshi
Sakshi News home page

● ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

Feb 9 2026 7:49 AM | Updated on Feb 9 2026 7:49 AM

● ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

● ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

● ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

కరీంనగర్‌టౌన్‌: కాంగ్రెస్‌, బీజేపీ నేతల మాటలు నమ్మవద్దని, రెండున్నరేళ్లలో కరీంనగర్‌కు నయాపైసా తేలేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా 41,22,23,46,14,15,13,26,54 డివిజన్ల అభ్యర్థులు తోట సుగుణ, జంగిలి సాగర్‌, బోనాల శ్రీకాంత్‌, గడ్డి ప్రదీప్‌, గుర్రాల శివ, కంజర్ల రేణుక, మేడి ఉమా మహేశ్వర్‌, నాంపల్లి భవాని, మంథెన అనితకు మద్దతుగా కాలనీల్లో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌ల్లో మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ హయాంలో హైదరాబాద్‌ తరువాత కరీంనగర్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపానని గుర్తు చేశారు. కాంగ్రెస్‌, బీజేపీలది ఓట్ల రాజకీయాలే తప్ప అభివృద్ధి పట్టదని అన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌ అడ్డగోలు అబద్ధాలు మానుకోవాలని హితవు పలికారు. వేంకటేశ్వరస్వామి ఆలయం కోసం పది ఎకరాల భూమి కేటాయించామని, ఇప్పటికీ నిర్మా ణం చేపట్టకపోవడం బాధాకరమన్నారు. గ్రేటర్‌ రెడ్డి సంక్షేమ సంఘం సమావేశంలో మాట్లాడుతూ రెండు పర్యాయాలు నగర మేయర్‌ పీఠాన్ని బీఆర్‌ఎస్‌కు అప్పగిస్తే అభివృద్ధి చేసి చూపించామని, మరోసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement