మేయర్‌కు టీఎన్జీవోల సన్మానం
కరీంనగర్‌అర్బన్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావును టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సన్మానించారు. వారి కార్యాలయాల్లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీవోల సంఘం 2026 డైరీని అందజేశారు. టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి సంగెం లక్షణ్‌రావు, రాష్ట్ర నాయకులు గూడ ప్రభాకర్‌రెడ్డి, రాగి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి కిరణ్‌కుమార్, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేశ్ భరద్వాజ్, రూరల్ అధ్యక్షులు కోడూరి వాస్త్తవిక్ గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి, కార్యదర్శి శంకర్, నాయకులు శ్రీనివాస్, అశోక్, ముత్తయ్య, మల్క రాజేశ్వరరావు, పాల్గొన్నారు.


