మండెపల్లి శివారులో అగ్నిప్రమాదం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని మండెపల్లి గ్రామశివారులోని నర్సరీ ప్రాంతంలో మంగళవారం ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న సిరిసిల్ల అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని శివారులో వ్యాపిస్తున్న మంటలను ఆర్పివేసి అదుపులోకి తీసుకొచ్చారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో ఈ నెల 10న శరీరంపై కాలిన గాయాలతో ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం అదేరోజు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 15న రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు, ఆధారాలు లేకపోవడంతో మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీ గదిలో భద్రపరిచినట్లు జీఆర్‌పీ ఎస్‌ఐ మహేందర్, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారాయణపూర్ క్రాస్‌రోడ్డు సమీపంలో కామారెడ్డి–సిరిసిల్ల ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జంగిడి రాజు(34) అనే వ్యక్తి మృతి చెందారు. ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామానికి చెందిన రాజు ద్విచక్రవాహనంపై సిరిసిల్ల నుంచి కామారెడ్డి వైపు వెళ్తుండగా రాచర్ల గొల్లపల్లి నుంచి సిరిసిల్ల వెళ్తున్న కారును మూలమలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాడు. ఘటనలో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్రవాహనం, కారు నుజ్జునుజ్జయ్యాయి. అటుగా వెళ్తున్న ద్విచక్రవాహనదారులు పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్ రెడ్డి తెలిపారు.
23 వారాలకు జన్మించిన శిశువులను కాపాడొచ్చు
కరీంనగర్: 23 వారాల్లో జన్మించిన శిశువులను కాపాడే అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని హైటెక్‌సిటీ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ ఆస్పత్రి పిల్లల వైద్య నిపుణులు నియోనాటలిస్టు డాక్టర్ రవీందర్‌రెడ్డి, పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ మ ధుమోహన్, గైనకాలజిస్టు డాక్టర్ భార్గవి తెలిపారు. నెలలు నిండకుండా జన్మించిన శిశువులకు ఆధునిక పరికరాలతో చేపట్టే చికిత్స విధానంపై మంగళవారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. 23–24 వారాల్లో జన్మించిన శిశువులకు ఆధునిక శ్వాస సహాయం, నిరంతర పర్యవేక్షణ అత్యంత అవసరమన్నారు. హైటెక్‌సిటీ మెడికవర్ ఉమెన్ – చైల్డ్ హాస్పిటల్‌లో అత్యాధునిక ఎన్‌ఐసీయూ సదుపాయాలు, 24 గంటల నీయోనేటాలజీ సేవలు, పీడియాట్రిక్ సర్జరీ, ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. హైరిస్క్ గర్భధారణలు, నవజాత శిశువుల సమస్యలను తొలిదశలోనే గుర్తించి సరైన కేంద్రాలకు రిఫర్ చేస్తే చికిత్స ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్నారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, కోట కర్నాకర్, హెచ్‌ఆర్ మేనేజర్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
మండెపల్లి శివారులో అగ్నిప్రమాదం
మండెపల్లి శివారులో అగ్నిప్రమాదం


