కరీంనగర్ కోర్టుకు బాంబు బెదిరింపు
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ జిల్లా కోర్టుకు బాంబు బె దిరింపు కలకలం రేపింది. ఆర్‌డీఎక్స్ బాంబులు అ మర్చినట్లు జిల్లా జడ్జి అధికారిక మెయిల్ ఐడీకి మె యిల్ వచ్చింది. ఉదయం 09.05 గంటలకు జిల్లా జడ్జి మెయిల్‌కు (సున్నియా దాసన్ ఔట్ లుక్ డాట్ కాం) పేరిట మెయిల్ వచ్చింది. మధ్యాహ్నం 12.05 గంటలకు 12 ఆర్డీఎక్స్ బాంబులు పేలడాని కి అమర్చబడ్డాయని, మధ్యాహ్నం ఇస్లామిక్ ప్రార్థనకు ముందు అందరూ కోర్టు సముదాయాన్ని ఖాళీ చేయండని మెయిల్ పంపారు. అప్రమత్తమైన సి బ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వ చ్చి డాగ్‌స్క్వాడ్, బాంబుస్క్వాడ్‌తో తనిఖీ చేశారు. బాంబు లేదని నిర్ధారించారు. దీంతో అధికారులు, న్యాయవాదులు ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
మెయిల్ పంపిన అజ్ఞాత వ్యక్తి
తనిఖీ చేసి, లేదని తేల్చిన పోలీసులు
కరీంనగర్ కోర్టుకు బాంబు బెదిరింపు


