ఐఎన్‌టీయూసీ రాష్ట్రకమిటీలో చోటు
జ్యోతినగర్(రామగుండం): ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కమిటీలో రామగుండంలోని ఎన్టీపీసీ పారిశ్రామిక ప్రాంతానికి పెద్దపీట వేస్తూ పలు పదవులను కేటాయించారు యూనియన్ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆయన పలువురిని నియమించారు. ఇందులో పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతానికి అధిక ప్రాధాన్యం కల్పించారు. కార్మిక సమస్యలపై నిరంతరం పోరాడే నాయకుడిగా గుర్తింపు పొందిన బాబర్ సలీంపాషాను ఏపీ–తెలంగాణ రాష్ట్ర చీఫ్ పాధ్యక్షుడిగా నియమించారు. కార్యదర్శులుగా వేముల కృష్ణయ్య, సందినేని గోపాల్‌రావు, భూమల్ల చందర్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా బొద్దున రాజేశం, పెద్దపల్లి సతీశ్ యాదవ్, జమీల్‌ను నియమించారు. కాగా, సంజీవరెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
ఏపీ – తెలంగాణ చీఫ్ ఉపాధ్యక్షుడిగా బాబర్ సలీంపాషా
ఐఎన్‌టీయూసీ రాష్ట్రకమిటీలో చోటు
ఐఎన్‌టీయూసీ రాష్ట్రకమిటీలో చోటు
ఐఎన్‌టీయూసీ రాష్ట్రకమిటీలో చోటు


