యువకుడి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

యువకుడి అదృశ్యం

Feb 19 2026 9:29 AM | Updated on Feb 19 2026 9:29 AM

యువకుడి అదృశ్యం

యువకుడి అదృశ్యం

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం మిస్సింగ్‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. అల్లూరు గ్రామానికి చెందిన బాదె సంతోష్‌(25)ఈనెల 15న ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రివరకూ తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు.. బంధువులు, ఇరుగుపొరుగు వారు, తెలిసిన వారిఇళ్లలో వాకబు చేసినా ఆచూకీ తెలియరాలేదు. ఈమేరకు అతడి బావ మంగ వెంకటేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. ఆచూకి తెలిసిన వారు 87126 56520 నంబరుకు ఫోన్‌చేసి సమాచారం అందించాలని సీఐ ప్రసాద్‌రావు సూచించారు.

మోసం చేసిన కేసులో ఐదేళ్ల జైలు

గోదావరిఖనిటౌన్‌: ఓ మహిళను మోసం చేసి గర్భవతిని చేయడంతోపాటు బాధితురాలు, ఆమె కుటుంబసభ్యులను కులం పేరుతో దూషించిన వ్యక్తికి ఐదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.4 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పుచెప్పినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. వారి కథనం ప్రకారం.. రామగుండం ప్రాంతానికి చెందిన ఓ మహిళకు గోదావరిఖని అడ్డగుట్టపల్లికి చెందిన ముత్యాల సుదర్శన్‌కు 2008లో పరిచయం ఏర్పడింది. 2010లో ఆమెను పెళ్లి చేసుకుని ఉద్యోగం ఇప్పిస్తానని కొన్ని డబ్బులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమె గర్భవతి కావడంతో తనకు సంబంధం లేదని తప్పించుకున్నాడు. అంతేకాదు.. ఆమెతోపాటు ఆమె తమ్ముడిని, తల్లిని కులం పేరుతో దూషించాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గోదావరిఖని వన్‌ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో సాక్ష్యాధారాలు సమర్పించారు. ఇరువర్గాల వాదనలు విన్నాక నిందితుడికి కోర్టు శిక్ష ఖరారు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలికి అదనంగా రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు పోలీసులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement