దైవదర్శనానికి వచ్చి మృత్యుఒడికి
మాచారెడ్డి/ ఎల్లారెడ్డిపేట: దైవ దర్శనానికి వచ్చిన భక్తుడు ఒక రు ప్రమాదవశాత్తు కోనేరు బా విలో పడి మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మినర్సింహస్వామి ఆలయ వద్ద మంగళవారం రాత్రి జరిగింది. ఎస్సై అనిల్ కథనం ప్రకారం వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన పందిర్ల సురేశ్‌గౌడ్(45) తరచూ లక్ష్మినర్సింహస్వామి ఆలయానికి వచ్చి వెళ్తుంటాడు. మంగళవారం దైవదర్శనానికి వచ్చి కాళ్లు, చేతులు కడుక్కునే క్రమంలో ప్రమాదవశాత్తు కోనేరులో పడి మృతిచెందినట్టు వివరించారు. ఈమేరకు బుధవారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
జగిత్యాలక్రైం: సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామ శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి వకులభరణం నర్సింహస్వామి (68) మృతిచెందాడు. వెల్గటూర్‌లోని హనుమాన్ ఆలయ ప్రధాన పూజారి వకులభరణం నర్సింహస్వామి భార్య రమాదేవితో కలిసి బుధవారం పెంబట్ల కోనాపూర్ గ్రామంలోని దుబ్బరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తిరిగి బైక్‌పై వెళ్తుండగా పెంబట్ల శివారులో అదుపుతప్పి కిందపడ్డారు. తలకు బలమైన గాయాలు కావడంతో జగిత్యాల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. రమాదేవికి స్వల్పగాయాలయ్యాయి. మృతుడి కుమారుడు సత్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సారంగాపూర్ ఎస్సై గీత తెలిపారు.
దైవదర్శనానికి వచ్చి మృత్యుఒడికి


