నేడు బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ అమలు | - | Sakshi
Sakshi News home page

నేడు బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ అమలు

Feb 16 2026 7:39 AM | Updated on Feb 16 2026 7:39 AM

నేడు

నేడు బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ అమలు

● సీపీ గౌస్‌ ఆలం

● సీపీ గౌస్‌ ఆలం

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ కార్పొరేషన్‌ మే యర్‌, డిప్యూటీ మేయ ర్‌ ఎన్నికలు, హుజూ రాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా సోమవారం ఆయాప్రాంతాల్లో ఉదయం 6గంటల నుంచి 17వ తేదీ ఉదయం 6గంటల వరకు బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ అమల్లో ఉంటుందని సీపీ గౌస్‌ ఆలం తెలిపారు. ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమికూడదని ఉత్తర్వులు జారీచేశారు. నగరంలో సోమవారం ట్రాఫిక్‌ దారిమళ్లింపు చర్యలు ఉంటా యని ట్రాఫిక్‌ ఏసీపీ యాదగిరి స్వామి తెలిపా రు. అమరవీరుల స్తూపం నుంచి మున్సిపల్‌ కార్యాలయం వైపు, బస్టాండ్‌ నుంచి బయటకు వచ్చే ప్రత్యామ్నాయమార్గాల ద్వారా దారిమళ్లింపు ఉంటుందన్నారు. సీఎస్‌ఐ చర్చి ప్రాంతం నుంచి మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లేదారులను మూసివేయడం, దారి మళ్లించడం జరుగుతుందని సూచించారు.

శివరాత్రికి నిరంతర విద్యుత్‌

కొత్తపల్లి(కరీంనగర్‌): మహాశివరాత్రి సందర్భంగా కరీంనగర్‌ సర్కిల్‌ పరిధిలో నిరంతర విద్యుత్‌ సరఫరా చేశామని టీజీఎన్‌పీడీసీఎల్‌ కరీంనగర్‌ సర్కిల్‌ ఇన్‌చార్జి ఎస్‌ఈ వడ్డకొండ గంగాధర్‌ తెలిపారు. సర్కిల్‌ పరిధిలోని అన్ని శివాలయాలు విద్యుత్‌ దీపాలతో ప్రకాశిస్తున్నాయని అన్నారు. సరఫరాలో అంతరాయం లే కుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ముందస్తు లోడ్‌ అంచనాకు అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్ల సామర్ధ్యం పెంచామని, తీగలకు చెట్ల కొమ్మలు తగలకుండా కత్తరించడం జరిగిందని, లైన్ల మధ్యలో స్పేసర్లు ఏర్పాటు చేశామన్నారు. 24 గంటల పర్యవేక్షణకు అదనపు సిబ్బందిని నియమించామని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారని పేర్కొన్నారు.

కొత్తగట్టులో అగ్నిగుండాలు

శంకరపట్నం: మండలంలోని కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి గుట్టపై శివరాత్రి సందర్భంగా ఆదివారం అగ్నిగుండాలు ఏర్పాటు చేశారు. భక్తులు అగ్ని గుండాల్లోంచి నడిచారు. కొత్తగట్టు, కేశవపట్నం, కన్నాపూర్‌, చింతలపల్లిలో శివకల్యాణం జరిపించారు. ఆలయ చైర్మన్‌ కోరెం రాజిరెడ్డి పాల్గొన్నారు.

ధర్మభిక్షం ఆశయసాధనకు ఉద్యమిద్దాం

కరీంనగర్‌టౌన్‌: తెలంగాణ సాయుధ పోరా టయోధుడు, మాజీ ఎంపీ ధర్మభిక్షం ఆశయా ల సాధించేందుకు ఉద్యమించాలని న్యాలపట్ట రాజు పిలుపునిచ్చారు. ఆదివారం ధర్మభిక్షం 104వ జయంతి సందర్భంగా బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఆయన చిత్రపటానికి న్యాలపట్ల రాజుగౌడ్‌, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, కల్లుగీత పనివారాల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పైడిపల్లి రాజు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి పాల్గొన్నారు.

అక్రమ నిర్మాణాల కూల్చివేత

కొత్తపల్లి: కొత్తపల్లి తహసీల్‌ కార్యాలయ పరిధి లోని రేకుర్తి సర్వే నం.55 ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలను శనివారం రాత్రి పోలీసుల సహకారంతో రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు కూల్చివేశారు. రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండటంతో గురువారం అక్రమ నిర్మాణాలు చపట్టగా.. స్థానికుల ఫిర్యాదుతో అక్రమ కట్టడాలను కూల్చివేశారు.

నేడు బీఎన్‌ఎస్‌ఎస్‌   163 సెక్షన్‌ అమలు1
1/4

నేడు బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ అమలు

నేడు బీఎన్‌ఎస్‌ఎస్‌   163 సెక్షన్‌ అమలు2
2/4

నేడు బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ అమలు

నేడు బీఎన్‌ఎస్‌ఎస్‌   163 సెక్షన్‌ అమలు3
3/4

నేడు బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ అమలు

నేడు బీఎన్‌ఎస్‌ఎస్‌   163 సెక్షన్‌ అమలు4
4/4

నేడు బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ అమలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement