ఒక్క కరీంనగర్‌కే ఇంత ఆర్భాటమా? | - | Sakshi
Sakshi News home page

ఒక్క కరీంనగర్‌కే ఇంత ఆర్భాటమా?

Feb 18 2026 6:58 AM | Updated on Feb 18 2026 6:58 AM

ఒక్క కరీంనగర్‌కే   ఇంత ఆర్భాటమా?

ఒక్క కరీంనగర్‌కే ఇంత ఆర్భాటమా?

ఒక్క కరీంనగర్‌కే ఇంత ఆర్భాటమా?

కరీంనగర్‌టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సాధించింది గుండు సున్నా అని, ఒక్క కరీంనగర్‌ మేయర్‌ పీఠం బోటాబోటీ మెజార్టీతో కై వసం చేసుకొని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు. మంగళవారం ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పని అయిపోయిందని, అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్న కేంద్రమంత్రి సంజయ్‌ మొన్నటి ఫలితాల్లో ఓట్ల శాతాన్ని బేరీజు వేసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌కు 39 శాతం ఓట్లు పడ్డాయని, బీఆర్‌ఎస్‌కు 29 శాతం ఉందని, బీజేపీకి కేవలం 15 శాతం ఓట్లు నమోదయ్యాయని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అని అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రిగా నిధులు తేవడంలో ఘోర వైఫల్యం చెందిన బండి ఇకనైనా అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. నాయకులు చల్లా హరిశంకర్‌, పొన్నం అనిల్‌కుమర్‌, చీటి రాజేందర్‌రావు, జక్కని ఉమాపతి, రవినాయక్‌, గంటల రేణుక, రవివర్మ, కంజర్ల రేణుక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement