పైచేయి | - | Sakshi
Sakshi News home page

పైచేయి

Feb 14 2026 7:22 AM | Updated on Feb 14 2026 7:22 AM

పైచేయ

పైచేయి

శనివారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 కమలం కార్పొరేషన్‌లో పైచేయి మున్సిపాలిటీల్లో జగిత్యాలలో స్వతంత్రుల హవా హంగ్‌ అయినా ఆధిపత్య పార్టీలకే

కేంద్ర మంత్రి బండి సంజయ్‌

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మిశ్రమ ఫలితం

9 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ జోరు

రాయికల్‌, మెట్‌పల్లి, కరీంనగర్‌లో కాషాయం హవా

సిరిసిల్ల, జమ్మికుంటలో బీఆర్‌ఎస్‌ సత్తా

మూడు చోట్ల హంగ్‌, ఆధిపత్య పార్టీలకే అవకాశం

జగిత్యాలలో స్వతంత్రుల విజయం

ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌

పెద్దపల్లిలో నాలుగు పురపాలికలు హస్తగతం

జమ్మికుంటలో ఉత్కంఠగా రాజకీయం

శనివారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
కమలం
కార్పొరేషన్‌లో
మున్సిపాలిటీల్లో
సింగ్‌ ఈజ్‌ కింగ్‌
తెరపైకి ఎక్స్‌అఫిిషియో ఓట్లు

నృత్యం చేస్తున్న విద్యార్థులు

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ కార్పొరేషన్‌లో విలీ నమైన గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులు కార్పొరే టర్లుగా గెలుపొందడం సంచలనంగా మారింది. కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల్లో కరీంనగర్‌ రూర ల్‌ మండలంలోని 7డివిజన్ల పరిధిలో ఐదింటిలో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. ఆరెపల్లిలోని 1వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి బారి అపర్ణ, తీగలగుట్టపల్లిలోని 2వ డివిజన్‌లో కొలగాని శ్రీనివా స్‌, తీగలగుట్టపల్లి–వల్లంపహాడ్‌లోని 3వ డివిజ న్‌లో సాదినేని లావణ్య, గోపాల్‌పూర్‌–దుర్శేడ్‌లోని 4వ డివిజన్‌లో భూపతి రవీందర్‌, బొమ్మకల్‌లోని 6వ డివిజన్‌లో మ్యాకల వెంకటేశ్‌ కార్పొరేటర్లుగా గెలుపొందారు. బొమ్మకల్‌– దుర్శేడ్‌లోని 5వ డివిజన్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాదె రూప, బొమ్మకల్‌– కృష్ణానగర్‌లోని 34వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి సమీనా పర్వీన్‌ విజయం సాధించారు.

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ పటిష్టమైన పోలీసు భద్రత మధ్య ముగిసింది. ఎన్నికలు ముగిసి ఎస్సారార్‌ కళాశాలలో స్ట్రాంగ్‌ రూంలో బ్యాలెట్‌ బాక్సులు పెట్టినప్పటి నుంచి కళాశాల ఆవరణలో మూడంచెల భద్రతా వలయం ఏర్పాటు చేశారు. శుక్రవారం సీపీగౌస్‌ ఆలం కౌంటింగ్‌ కేంద్రాన్ని సందర్శించి పోలీసులకు పలు సూచనలు చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని కౌంటింగ్‌ కేంద్రాలను సీపీ సందర్శించారు. నగరంలోని టూటౌన్‌ పరిఽధిలో ఇరువర్గాల మధ్య తోపులాట జరగ్గా టూటౌన్‌ పోలీసులు అక్కడకు చేరుకొని చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

కౌంటింగ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి, కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, తదితరులు

చొప్పదండిలో అదనపు కలెక్టర్‌ అశ్వినీ తానాజీ

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలోని 38వ డివి జన్‌కు సంబంధించి రీ కౌంటింగ్‌ వివాదం ఏర్పడింది. ఈ డివిజన్‌ నుంచి బీజేపీ అభ్యర్థి దేవసా ని సరస్వతి కాంగ్రెస్‌ అభ్యర్థి దేశబోయిన హారి కపై 12 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించా రు. రీ కౌంటింగ్‌ చేయాలని దేశబోయిన హారిక అధికారులను లిఖితపూర్వకంగా అభ్యర్థించారు. అప్పటికే విజేతగా ప్రకటించినందున రీకౌంటింగ్‌ అవసరం లేదంటూ బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరికి రీ కౌంటింగ్‌ చేపట్టినప్పటికీ.. తనకు సంబంధించిన బండెల్స్‌ మాత్రమే లెక్కించారని, మొత్తం ఓట్లు తిరిగి లెక్కించాలంటూ హారిక వాదనకు దిగారు. అధికారులు వినకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మేయర్‌ సునీల్‌రావు అధికారులను బెదిరించి, రీకౌంటింగ్‌ కాకుండా చూశారంటూ ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎస్సారార్‌లో ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది

జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 స్థానాలకు గాను 23 కాంగ్రెస్‌ గెలుచుకుంది. 23 మందిలో ఏడుగురు జీవన్‌రెడ్డి వర్గీయులు కాగా, 16 మంది సంజయ్‌ వర్గీయులు. 15 మంది స్వతంత్రులు గెలవడం గమనార్హం. మొత్తం మీద 18 చోట్ల సంజయ్‌ వర్గీయులు, 17 చోట్ల జీవన్‌రెడ్డి వర్గీయలు గెలుపొందారు. వీరి మధ్య సయోధ్యకు చర్చలు మొదలయ్యాయి. ఇక్కడ బీజేపీ 06, బీఆర్‌ఎస్‌ 04, ఎంఐఎం 02 సీట్ల చొప్పున అభ్యర్థులు గెలిచారు. 33 స్థానాలున్న కోరుట్లలో కాంగ్రెస్‌ 18 సీట్లు సాధించి మున్సిపాలిటీని వశపరరచుకుంది. 26 స్థానాలున్న మెట్‌పల్లి మున్సిపాలిటీలో 10 స్థానాలతో బీజేపీ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా నిలిచింది. 12 స్థానాలున్న రాయికల్‌లో 5 చోట్ల బీజేపీ విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక ఽ15 స్థానాలు ధర్మపురిలో 15 స్థానాలు కాంగ్రెస్‌ కై వసం చేసుకుని సరికొత్త రికార్డు నమోదు చేసింది.

మెట్‌పల్లి, రాయికల్‌లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. 26 స్థానాలున్న మెట్‌పల్లిలో 03 సీట్లతో కాంగ్రెస్‌ మూడోస్థానంలో నిలవగా.. 12 సీట్లున్న రాయికల్‌లో బీఆర్‌ఎస్‌తో సమానంగా 03 సీట్లు మాత్రమే తెచ్చుకుంది. ఈ రెండుచోట్ల బీజేపీకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక 30 సీట్లున్న జమ్మికుంటలో 12 బీఆర్‌ఎస్‌ గెలచుకుంది. 10 స్థానాలతో కాంగ్రెస్‌ రెండో ప్లేసులో నిలిచింది. నలుగురు స్వతంత్రులు, నలుగురు బీజేపీ అభ్యర్థులు కీలకమయ్యారు. ఇక్కడా బీఆర్‌ఎస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

విలీన గ్రామాల్లో

కౌంటింగ్‌కు

అవినీతి రహిత పాలన చూపిస్తాం

కరీంనగర్‌: కరీంనగర్‌ కార్పొరేషన్‌పై తొలిసా రి కాషాయజెండా ఎగరేసి రికార్డు సృష్టించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. బల్దియా లో అవినీతి రహిత పాలన చూపిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్‌ బల్దియా ఫలితా ల్లో బీజేపీ 30స్థానాలు కై వసం చేసుకోవడంతో పార్టీ శ్రేణులు ఎంపీ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. సంజయ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం కుమ్మకై ్క ఎన్నో కుట్రలు చేశాయని, ఓటుకు రూ.7 వేలు ఇచ్చి, చివరకు బీజేపీ అభ్యర్థులను, నాయకులను ప్రలోభపెట్టేదుకు కుట్ర లకు పాల్పడ్డారని ఆరోపించారు. అయినా వారి పాచిక పారలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎంఐఎం ఒవైసీ బ్రదర్స్‌ను పిలిచి రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. బండి సంజయ్‌ హిందుత్వమే మా ట్లాడతారు. అభివృద్ధి మాట్లాడరు. కరీంనగర్‌కు నయాపైసా కూడా తేలేదంటూ పిచ్చికూతలు కూసిన వాళ్లకు చెంపపెట్టు తీర్పు ఇచ్చి కర్రు కాల్చివాతపెట్టారని అన్నారు. కరీంనగర్‌ ప్రజలను ఆదుకునేది, అభివృద్ధి చేసేది మోడీ ప్రభుత్వమేనని నమ్మి ఆదరించారని తెలిపారు. 5 ఏళ్లలో కరీంనగర్‌ అభివృద్ధి ఏ విధంగా చేస్తామో చేతల్లో చూపిస్తామని స్పష్టం చేశారు. 30 సీట్లు గెలిచామని, కొన్ని కారణాలతో మరో ముగ్గురికి సీట్లు ఇవ్వలేకపోయినా కాషాయ జెండా కప్పుకుని తిరిగి గెలిచారని అన్నారు. ఇండిపెండెంట్లతో పాటు ఇతర పార్టీల్లో గెలిచినవారు కూడా బీజేపీలోకి రాబోతున్నారని తెలిపారు.

38వ డివిజన్‌

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పట్టణాల ఓటర్లు వైవిధ్య తీర్పునిచ్చారు. బల్దియా ఎన్నికల్లో అధికార పార్టీకి అధిక స్థానాలు కట్టబెట్టి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను రెండు చోట్ల ముందంజలో నిలబెట్టారు. మూడు చోట్ల బీజేపీకి అధికస్థానాలు అప్పగించి అనూహ్య ఫలితాలు ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు ఉండగా.. 9 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. మెట్‌పల్లి, రాయికల్‌ మున్సిపాలిటీలు, కరీంనగర్‌ కార్పొరేషన్‌లో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది. పెద్దపల్లి జిల్లాలో మూడు మున్సిపాలిటీలు, రామగుండం నగరపాలక సంస్థ కాంగ్రెస్‌ వశమైంది. ధర్మపురి మున్సిపాలిటీని క్లీన్‌స్వీప్‌ చేసింది. జగిత్యాలలో స్వతంత్రులు అధికస్థానాలు గెలిచి జోరుమీదున్నారు.

66 డివిజన్లున్న కరీంనగర్‌లో 30స్థానాలు గెలు చుకుని బీజేపీ పూర్తి ఆధిక్యత ప్రదర్శించింది. కాంగ్రెస్‌ 14, బీఆర్‌ఎస్‌ 9 స్థానాలకు పరిమితమవడంతో మేయర్‌ పీఠం బీజేపీ వశమవడంనల్లేరు మీద నడకలా ఉంది. దీనికితోడు ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్సీలు కలిపి మొత్తం మూడు ఎక్స్‌ అఫిషియో ఓట్లు వీరికి తోడుగా ఉన్నాయి. ఇప్పటికే పదిమంది వరకు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని కేంద్ర సహాయమంత్రి సంజయ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

చొప్పదండిలో 14 వార్డులకు కాంగ్రెస్‌ 10స్థానాలు కై వసం చేసుకుంది. 30 వార్డులున్న హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో 16 స్థానాలతో కాంగ్రెస్‌ సొంతం చేసుకుంది. జమ్మికుంటలో 30 సీట్లకు 12 స్థానాలు బీఆర్‌ఎస్‌, 10 సీట్లు కాంగ్రెస్‌ గెలుచుకున్నాయి. బీజేపీ నలుగురు, స్వతంత్రులు నలుగురు విజయం సాధించారు. సంఖ్యాపరంగా బీఆర్‌ఎస్‌కి ఆధిక్యమున్నా.. చైర్మన్‌ ఎన్నిక ఉత్కంఠగానే ఉంది. బీజేపీ, స్వతంత్రుల మద్దతుతో గులాబీ పార్టీ మున్సిపాలిటీని సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతోంది.

60 డివిజన్లు ఉన్న రామగుండం కార్పొరేషన్‌లో 38 స్థానాలు గెలిచి కాంగ్రెస్‌ సంపూర్ణ మెజారిటీ సాధించింది. బీఆర్‌ఎస్‌ 13, బీజేపీ 01 స్థానంతో ఏమాత్రం పోటీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. మంథని, సుల్తానాబాద్‌, పెద్దపల్లి మున్సిపాలిటీలనూ ఇదే తరహాలో కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 స్థానాలకు 27 సీట్లు గెలచుకుని బీఆర్‌ఎస్‌ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ 06, బీజేపీ 05 స్థానాల్లో తరువాతి స్థానాల్లో నిలిచాయి. వేములవాడలో 28 సీట్లకు 13 స్థానాల్లో హస్తం విజయకేతనం ఎగరేసింది. బీజేపీ 08 స్థానాలు, బీఆర్‌ఎస్‌ 05, ఇండిపెండెంట్లు రెండు సీట్లు గెలుచుకున్నారు.

పైచేయి1
1/8

పైచేయి

పైచేయి2
2/8

పైచేయి

పైచేయి3
3/8

పైచేయి

పైచేయి4
4/8

పైచేయి

పైచేయి5
5/8

పైచేయి

పైచేయి6
6/8

పైచేయి

పైచేయి7
7/8

పైచేయి

పైచేయి8
8/8

పైచేయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement