ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
కరీంనగర్ క్రైం: జిల్లాలో ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతా వరణంలో నిర్వహించేందుకు 163 బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ విధిస్తున్నట్లు సీపీ గౌస్‌ఆలం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడంపై నిషేధం విధించినట్లు తెలి పారు. కరీంనగర్ కార్పొరేషన్, చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని, ఈనెల 10న ఉదయం 6 గంటల నుంచి 12న ఉద యం 6 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. ఏదైనా చట్టబద్ధమైన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తే సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కరీంనగర్: ఆదరించి గెలిపిస్తే ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని మాజీ మేయర్, బీజేపీ అభ్యర్థి యాదగిరి సునీల్‌రావు అన్నారు. సోమవారం 42వ డివిజన్ భగత్‌నగర్‌లో విస్తృత ప్రచారం చేశారు. వివేకానందస్కూల్, అయ్యప్ప టెంపుల్, గోదాంగడ్డ మెయిన్‌రోడ్డు, గోదాం గడ్డ వాటర్‌ట్యాంక్, సాయికృష్ణ థియేటర్ తదితర ప్రాంతాల్లో గడపగడపకూ ప్రచారం నిర్వహించారు. ఏ ప్రాంతానికి వెళ్లినా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి మద్దతు ప్రకటించారు. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాననే భరోసా కల్పిస్తుండటంతో ఓటర్లు వారి వైపు మొగ్గుచూపుతున్నారు. చైతన్య, ఆదర్శ, జై భీమ్, మహాదేవ యూత్ క్లబ్ సభ్యులు, భగత్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, డివిజన్ పెద్దలు, మహిళలు, పార్టీ శ్రేణులు ప్రచారంలో పాల్గొన్నారు.
హుజూరాబాద్: మున్సిపల్ ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని రాష్ట్ర ఎన్నికల జనరల్ అబ్జర్వర్, అదనపు కలెక్టర్ జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీవోలు, ఏపీవోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. అధికారులు ఎం.మనోహర్, సయ్యద్, ముసాబ్ అహ్మద్, మహ్మద్ జలాలోద్దీన్ అక్బర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి(కరీంనగర్): మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే తాను ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తానని ఓ అభ్యర్థి వినూత్న ప్రచారం ప్రజల్లో చర్చకు దారితీస్తోంది. కరీంనగర్ నగరపాలక పరిధిలోని 17వ డివిజన్ (కొత్తపల్లి) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేముల కవిత చంద్రశేఖర్ రూ.100 బాండ్ పేపర్‌పై హామీలు ఇస్తూ సోమవారం స్థానిక ప్రజలకు ఒప్పంద పత్రం రాసిచ్చారు. తనను కార్పొరేటర్‌గా గెలిపిస్తే సొంత నిధులతో డివిజన్‌లోని ప్రతీ ఆడబిడ్డ వివాహానికి కానుకగా రూ.10,116, డివిజన్‌లో ఆడబిడ్డ జన్మిస్తే రూ.10,116 ఫిక్స్‌డ్ డిపాజిట్, ఎవరైనా మరణిస్తే అంతిమ సంస్కారానికి రూ.5,016 అందజేస్తానంటూ ఒప్పంద పత్రాన్ని విడుదల చేశారు. హామీల బాండ్ పేపర్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నప్పటికీ పలువురు స్వాగతిస్తున్నారు.
సప్తగిరికాలనీ(కరీంనగర్): మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రంగా కరీంనగర్ ఎస్సారార్ కళాశాలను నిర్ణయించినందున ఈ నెల 10 నుంచి 13 వరకు కళాశాలకు సెలవులు ప్రకటించినట్లు ప్రిన్సిపాల్ రామకృష్ణ తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా కళాశాల ప్రాంగణంలోకి విద్యార్థులను అనుమతించబడరని, గమనించాలని పేర్కొన్నారు.
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి


