గంగాధర: పిల్లల భవిష్యత్‌లో తల్లితండ్రులపాత్ర కీలకమైందని ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు అన్నారు. మధురానగర్ వివేకానంద లిటిల్ జీనియస్ పాఠశాలలో గురువారం నిర్వహించిన కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్‌న్, వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడాడు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేట్ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కరస్పాండెంట్ లక్ష్మారెడ్డి, డైరెక్టర్ అనంతరెడ్డి, ప్రిన్సిపాల్ ఉషారాణి, హెచ్‌ఎం నర్సింగరావు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.


