కరీంనగర్/కరీంనగర్‌కల్చరల్: చిన్నారుల్లో పుస్తక పఠనం అలవాటు పెంపొందించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని, గ్రంథాలయాలు వారి జ్ఞాన వికాసానికి ముఖ్య కేంద్రాలుగా నిలుస్తాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం అన్నారు. అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో లయన్స్ క్లబ్ వారి సహకారంతో చిన్నారులకు పుస్తక పఠనంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బహుమతులు అందజేశారు. సత్తు మల్లేశం మాట్లాడుతూ.. పిల్లలు చిన్ననాటి నుంచే మంచి పుస్తకాలు చదివి తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. లయన్స్ క్లబ్ సహకారంతో జిల్లా గ్రంథాలయానికి 4 సిమెంట్ బెంచీలు అందించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ముక్కె శరత్‌కృష్ణ, కార్యదర్శి మ్యాజిక్ శివకాంత్, ప్రోగ్రాం చైర్మన్ సింగమరాజు, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


