బీపీ.. షుగర్‌.. సూసైడ్‌! | - | Sakshi
Sakshi News home page

బీపీ.. షుగర్‌.. సూసైడ్‌!

Apr 3 2026 7:20 AM | Updated on Apr 3 2026 7:20 AM

శుక్రవారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 ● కరీంనగర్‌లోనే అత్యధికం ● చివరి స్థానంలో సిరిసిల్ల ● 108 వార్షిక నివేదికలో వెల్లడి

మానసిక సమస్యలతో ఆత్మహత్యాయత్నాలు

శుక్రవారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

రోడ్డు ప్రమాదం.. ఆత్మహత్యాయత్నం.. షుగర్‌.. బీపీలతో ఇబ్బందిపడుతున్న వారికి 108 సిబ్బంది మెరుగైన సేవలు అందిస్తున్నారు. రాత్రి..పగలు అనే తేడా లేకుండా ఎప్పుడూ ఫోన్‌కాల్‌ వచ్చినా అందుబాటులో ఉంటున్నారు. 108 వాహనం కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరీంనగర్‌ నుంచే అత్యధిక ఫోన్‌కాల్స్‌ వస్తుండడం గమనార్హం. రాజన్నసిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాలు.. ఆత్మహత్యాయత్నాలు తక్కువగానే నమోదవుతున్నట్లు 108 వార్షిక నివేదికలో వెల్లడైంది. ఈ సందర్భంగా 108 సేవలు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రాంతాల వారీగా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ స్పెషల్‌ స్టోరీ.

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌ :

మ్మడి జిల్లాలో ఆరోగ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, గుండె సంబంధిత వ్యాధులు, మానసిక సమస్యలు పెరుగుతున్నట్లు 108 గణాంకాలు తెలియజేస్తున్నాయి. మార్చి 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు నమోదైన ఈ గణాంకాలు ప్రజల జీవనశైలిలో వచ్చిన మార్పులను సూచిస్తున్నాయి. ఈ గణాంకాల ప్రకారం కరీంనగర్‌ జిల్లా అన్ని విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచింది. రోడ్డు ప్రమాదాల సంఖ్య 3,435గా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.వేగం, ట్రాఫిక్‌ నియమాలపై నిర్లక్ష్యం, రహదారి భద్రతలో లోపాలు వంటి కారణాలతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. స్పృహ కోల్పోయిన కేసులు 1,761గా నమోదు కావడం, గుండె సంబంధిత సమస్యలు 1880కు చేరడం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒత్తిడి, వ్యాయామలోపం వంటి అంశాలు ఈ పరిస్థితులకు దారితీస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

పాయిజనింగ్‌ కేసులు 1,037గా నమోదు కావడం ఆందోళన కల్గించే అంశం. వ్యవసాయ ప్రాంతాల్లో పురుగుమందుల వినియోగం అధికంగా ఉండటం, అవగాహన లోపం, కుటుంబ సమస్యలు వంటి కారణాలతో ఈ ఘటనలు పెరుగుతున్నాయి. ఆత్మహత్యాయత్నాలు కూడా 542గా నమోదవడం మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. జగిత్యాల జిల్లా రెండో స్థానంలో నిలిచింది. రోడ్డు ప్రమాదాలు 2,782గా ఉండగా, గుండె సమస్యలు 1,099గా నమోదయ్యాయి. పాయిజనింగ్‌ కేసులు 695గా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు 1,778గా నమోదయ్యాయి. ఇక రాజన్నసిరిసిల్ల జిల్లా మాత్రం అన్ని విభాగాల్లో చివరి స్థానంలో నిలిచింది. రోడ్డు ప్రమాదాలు 1,691గా ఉండగా, గుండె సమస్యలు 832, పాయిజనింగ్‌ కేసులు 296 మాత్రమే నమోదయ్యాయి. ఇది అక్కడి ప్రజల్లో కొంత మేర అవగాహన ఉందని సూచిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement