పురపోరు ముగిసింది..
న్యూస్‌రీల్
చెదురుమదురు ఘటనలు మినహా మున్సి‘పోల్స్’ ప్రశాంతం
కరీంనగర్‌లో పలుచోట్ల ఉద్రిక్తతలు, ఘర్షణలు
స్వయంగా లాఠీ ఝుళిపించిన సీపీ గౌస్ ఆలం
అత్యధికంగా హుజూరాబాద్‌లో 81.47 శాతం పోలింగ్
అత్యల్పంగా కరీంనగర్‌లో 62.98శాతం ఓటింగ్ నమోదు
రేపు కౌంటింగ్.. తేలనున్న భవితవ్యం
పోలింగ్ కేంద్రాల్లో నేతల వాగ్వాదాలు, లాఠీచార్జ్‌లు
కరీంనగర్‌లో దొంగ ఓట్లంటూ కలకలం
జగిత్యాలలో దొంగ ఓటరు పట్టివేత
రామగుండంలో ఓటరు లిస్టుపై రగడ
గురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
మేమూ..: మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ దంపతులు
ఓటేసిన..: ఓటు వేసిన కలెక్టర్ పమేలా సత్పతి
మాకొద్దీ యూరియా యాప్
శంకరపట్నం: ఆంక్షలు లేకుండా యూరియా సరఫరా చేయాలని, మొబైల్‌యాప్‌లో బుకింగ్ వద్దని మండలంలోని కన్నాపూర్ గ్రామంలో బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. మెట్‌పల్లి సహకార సంఘం పరిధిలోని కన్నాపూర్ గోదాంకు 240 బస్తాల లోడ్ వచ్చింది. విష యం తెలిసి కన్నాపూర్, ధర్మారం గ్రామాల రై తులు గోదాం వద్దకు చేరుకున్నారు. స్మార్ట్‌ఫోన్లు లేని రైతులకు మొబైల్‌యాప్‌లో యూరి యా బుకింగ్ కాకపోవడంతో పాటు 5జీ ఫోన్‌లోనే బుక్ కావడం, సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయని, బుకింగ్ లేకుండా పట్టాదారు పాసు పుస్తకంపై యూరియా ఇవ్వాలని గోదాం ఎదుట ఆందోళనకు దిగారు. రెండు గ్రామాల రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. దీంతో గోదాం సిబ్బంది తాళంవేసి వెళ్లిపోయారు. కన్నాపూర్ గోదాం, కేశవపట్నం సోమేశ్వర ఫర్టిలైజర్ దుకాణాలను జిల్లా వ్యవసాయశాఖ అధికారి భాగ్యలక్ష్మి, ఏడీఏ శ్రీధర్ తనిఖీ చేశారు. జనవరి 31నుంచి 2,287 మంది రైతులు 7,439 బస్తాల యూరియా బుక్ చేసుకుంటే, 6,703 బస్తాలు పంపిణీ జరిగిందన్నారు. అవసరం మేరకు యూరియా సరఫరా చేస్తామని డీఏవో తెలిపారు.
యూరియా కొరతకు కేంద్రమే కారణం
కరీంనగర్ కార్పొరేషన్: యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం నగరంలోని సుడా క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు ఎరువులు ఇవ్వాల్సిన బాధ్యత బండి సంజయ్‌పై లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే వాటా గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు. రాష్ట్రంలో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని, యూరి యా ఇవ్వకుండా మోసం చేస్తోందని బండి సంజయ్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన యూరియా వాటా ను సకాలంలో అందించకుండా బీజేపీ సర్కార్ మోసం చేసిందని మండిపడ్డారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, ఓటుకు పదివేల రూపాయలు ఇచ్చి కొంటున్నారని గంగుల చేసిన ఆరోపణను తోసిపుచ్చారు. డబ్బుతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందే బీఆర్‌ఎస్ అన్నారు.
ఓటేసిన ట్రాన్స్‌జెండర్లు
హుజూరాబాద్: హుజూరాబాద్‌లో నలుగురు ట్రాన్స్‌జెండర్లు ఓటేశారు. పట్టణంలో నలుగు రు ట్రాన్స్ జెండర్లుగా నమోదు కాగా.. 100 శాతం నమోదై ఆదర్శంగా నిలిచారు. పట్టణంలోని గాంధీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కుమారి, రవళి ఓటేశారు. కృష్ణవేణి పబ్లిక్ స్కూల్లో రాజి, కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో సత్తెమ్మ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
అటు ఓటింగ్.. ఇటు డబ్బులు
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాల్లో బుధవారం పోలింగ్ సందర్భంగా అభ్యర్థులు ఓటర్లకు పెద్దఎత్తున డబ్బుల పంపిణీ యథేచ్ఛగా చేపట్టారు. ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, దుర్శేడ్, గోపాల్‌పూర్, బొమ్మకల్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలకు చెందిన నాయకులు ఓటర్లను కలిసి డబ్బులిస్తూ.. ఆటోల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించినట్లు సమాచారం. 2వ డివిజన్ పరిధిలోని తీగలగుట్టపల్లిలో ఓ అభ్యర్థి ఇప్పటికే ఓటుకు రూ.6వేల చొప్పున పంపిణీ చేయగా కొంతమంది ఓటర్లకు రూ.4వేల నుంచి రూ. 5వేల వరకు మరోసారి ఇవ్వడం విశేషం. ఆరెపల్లిలో సైతం పోటాపోటీగా ఓటర్ల ఇంటికి వెళ్లి డబ్బులిచ్చారు. బొమ్మకల్‌లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటుకు రూ.1,000 నుంచి రూ.1,500 చొప్పున పంపిణీ చేసినట్లు తెలిసింది.
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దాదాపు పక్షం రోజుల పాటు జరిగిన హోరాహోరీ ఎన్నికల ప్రచారానికి ఫలితం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగగా హుజూరాబాద్‌లో అత్యధికంగా 81.47శాతం ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా కరీంనగర్‌లో 62.98శాతం రికార్డయింది. 79.81శాతంతో జమ్మికుంట రెండోస్థానంలో నిలిచింది. 78.76శాతం పోలింగ్‌తో హుజూరాబాద్ మూడోస్థానంలో ఉంది. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ సెంటర్లకు తరలించారు.
కరీంనగర్‌లో రణరంగం
జిల్లాలో పురపాలికల ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. కరీంనగర్ కార్పొరేషన్‌లో పలు పోలింగ్ బూత్‌ల వద్ద బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, స్వతంత్ర నేతల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఉద్రిక్తతలు చాలా చోట్ల లాఠీచార్జికి దారితీశాయి. పలు చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జమ్మికుంట, హుజురాబాద్, చొప్పదండిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలింగ్ సజావుగా సాగింది.
వెబ్‌కాస్టింగ్‌తో కలెక్టర్ పర్యవేక్షణ
కలెక్టర్ పమేలా సత్పతి పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ప్రక్రియను పరిశీలించారు. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ఎన్నికల సరళని పర్యవేక్షించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా కలెక్టరేట్ నుంచి ఎన్నికల తీరును పరిశీలిస్తూ అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ ప్రక్రియ కోసం ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ సెంటర్‌ను పరిశీలించారు. కరీంనగర్‌లోని రోడ్లు భవనాలశాఖ ఎస్‌ఈ కార్యాలయంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. జ్యోతినగర్‌లోని ఎస్సార్ ఉన్నత పాఠశాల పోలింగ్‌స్టేషన్లను సందర్శించారు. సెయింట్ ఆల్ఫోన్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించారు. ఈ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన వారికి మొక్కలు అందజేశారు. బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ దంపతులు 59వ డివిజన్ ముకరంపుర హైస్కూల్‌లో ఓటేశారు.
భారీ బందోబస్తు
మున్సిపల్ ఎన్నికలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశా రు. జిల్లావ్యాప్తంగా 1,300 మంది విధుల్లో పాల్గొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌లోనే 900 మంది డ్యూటీ నిర్వహించారు. ఉదయం సీపీ గౌస్ ఆలం 23 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను స్వయంగా పరిశీలించారు. పలు డివిజన్లలో నేతల మధ్య చెలరేగిన ఘర్షణలు ఉద్రిక్తతలకు దారితీయగా.. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. 32వ డివిజన్‌లో హుస్సేనీపురాలో జరిగిన లాఠీచార్జిలో సీపీ గౌస్ ఆలం స్వయంగా పాల్గొని అల్లరిమూకలను చెదరగొట్టారు. 3వ టౌన్ పరిధిలో జరిగిన పలు ఘర్షణలపై పోలీసులు కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఓటేసిన ప్రముఖులు
కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో జరిగిన ఎన్నికల్లో ప్రముఖులు ఓటేశారు. పలు పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు వారు నివాసముండే డివిజన్ల పరిధిలోని పోలింగ్ బూత్‌ల్లో కుటుంబసభ్యులతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు. 50వ డివిజన్ జ్యోతినగర్‌లోని ఎస్‌ఆర్ హైస్కూల్‌లోని 361 పోలింగ్‌బూత్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఓటేశారు. 52వ డివిజన్ క్రిస్టియన్ కాలనీలోని ట్రినిటి కళాశాలలో కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే కేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు ఓటేశారు. మంకమ్మతోటలోని దన్గర్‌వాడీ పాఠశాలలో సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
చొప్పదండిలో ఓటేసిన ఎమ్మెల్యే సత్యం
మున్సిపల్ 9 గంటలకు 11 గంటలకు 1 గంటకు 3 గంటలకు 5 గంటలకు
కరీంనగర్ 9.18 24.36 39.27 51.95 62.98
జమ్మికుంట 7.74 24.89 47.35 65.53 79.81
హుజూరాబాద్ 11.70 30.41 52.90 69.90 81.47
చొప్పదండి 12.47 34.49 56.96 74.28 78.76
ఓట్ల జగడం!
32వ డివిజన్ లో ఆందోళనకారులను చెదరగొడుతున్న పోలీసులు
ఆందోళనకారులను హెచ్చరిస్తున్న సీఐ
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో చెదురు మదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 58వ డివిజన్ జిల్లా పరిషత్ పోలింగ్‌బూత్‌లో బీఆర్‌ఎస్ నేతలు తమఓట్లు వేశారంటూ బీజేపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. ఇది లాఠీచార్జ్‌కు దారి తీసింది. 32వ డివిజన్‌లో ఎంఐఎం, బీఆర్‌ఎస్ అభ్యర్థుల వర్గీయులు పరస్పర దాడులకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. 33వ డివిజన్‌లో దొంగ ఓట్లు పడ్డయని ప్రచారం జరిగినా.. దాన్ని మున్సిపల్ కమిషనర్ ఖండించారు. 28 డివిజన్‌లో తమ నేతలను అరెస్టు చేయడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 49వ డివిజన్ రాంనగర్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మశ్రీ భర్త శ్రీనివాస్‌రెడ్డి సెల్‌ఫోన్ లాక్కుని బీజేపీ నాయకులు పగులగొట్టారని ఆరోపించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థి భర్త ఎన్నం ప్రకాశ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 36వ డివిజన్‌లో పోలీసులతో స్వతంత్ర అభ్యర్థి యాదయ్య వాగ్వాదానికి దిగారు. 27 డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బంధువు అయిన పోలీసు తమపై చేయి చేసుకున్నారని ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఆరోపించాడు.
పెద్దపల్లి జిల్లాలో..
పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు అభ్యర్థి రజని కష్ణమూర్తి ఫొటోల గుర్తుతో కూడిన ఓటర్ స్లిప్పు పంపిణీ చేశారంటూ బీజేపీ అభ్యర్థి నిరసనకు దిగారు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, మనోహర్‌రెడ్డి అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రామగుండం కార్పొరేషన్ ఎనిమిదోకాలనీ 17వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో అధికారుల వద్ద ఉండాల్సిన ఓటింగ్ లిస్టు బయటికి వచ్చిందని బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు.
జగిత్యాల జిల్లా
జగిత్యాలలోని 31వ వార్డులో ఎంఐఎం బీఆర్‌ఎస్ పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. 26వ వార్డులో ఓటు వేసేందుకు వచ్చిన జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన బాపురపు చంద్రశేఖర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మెట్‌పల్లి మున్సిపాలిటీలో 12వ వార్డులో ఓ అంగన్వాడీ కార్యకర్త అధికార పార్టీకి అనుకూలంగా ఉందని ఆరోపణలు రావడంతో విధుల నుంచి తొలగించారు. జగిత్యాల 27వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి స్వతంత్ర అభ్యర్థికి మధ్య పలుమార్లు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. జగిత్యాల 2వ వార్డు నుంచి పోటీ చేసిన అభ్యర్థుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి. ఏకంగా ఒకరినొకరు తోసుకున్నారు. కోరుట్లలో 27 వార్డులో స్వతంత్ర అభ్యర్థి తన ఎన్నికల గుర్తు అయిన ఆపిల్ పండ్లు పంచుతుండగా పోలీసులు అడ్డుకున్నారు.
సిరిసిల్ల జిల్లా
సిరిసిల్లలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వేములవాడ 12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రామతీర్థపు కృష్ణవేణి తనను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించకుండా బీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓ ఎస్సై సపో ర్టు చేస్తున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించా రు. వేములవాడ మున్సిపాలిటీలో 4వ వార్డులో బీ ఆర్‌ఎస్ అభ్యర్థి మారం కుమార్ సతీమణి పోలింగ్ ఏజెంట్‌గా మరో వ్యక్తి ఐడీ కార్డుతో ఓట్లు అడిగిన ట్లు కాంగ్రెస్ అభ్యర్థి తోట రాజు ఆరోపించారు.
బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం
పురపోరు ముగిసింది..
పురపోరు ముగిసింది..
పురపోరు ముగిసింది..
పురపోరు ముగిసింది..
పురపోరు ముగిసింది..
పురపోరు ముగిసింది..
పురపోరు ముగిసింది..
పురపోరు ముగిసింది..
పురపోరు ముగిసింది..
పురపోరు ముగిసింది..
పురపోరు ముగిసింది..
పురపోరు ముగిసింది..
పురపోరు ముగిసింది..


