● 11 గంటలకు ప్రత్యేక సమావేశం ● 12.30 గంటలకు మేయర్ ఎన్న
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ కొత్త పాలకవర్గం కొలువుతీరనుంది. సోమవారం సభ్యు ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలకు నగరపాలకసంస్థ అధికారులు కౌన్సిల్ హాల్‌లో ఏర్పాట్లు పూర్తిచేశారు. సోమవారం ఉద యం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొత్తగా ఎన్నికై న 66మంది కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మేయర్ ఎన్నిక చేపడుతారు. అనంతరం డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారు. సభ్యుల ప్రమాణ స్వీకారానికి కౌన్సిల్ హాల్‌లో పార్టీలవారీగా, తెలుగు అక్షర మాల ప్రకారం సభ్యులకు సీట్లు కేటాయించారు. తమకు కేటాయించిన సీట్లలోనే సభ్యులు కూర్చోవాల్సి ఉంటుంది.
35 మంది ఉంటేనే కోరం
మేయర్‌ఎన్నికకు నిబంధనల ప్రకారం కోరం ఉండాలి. నగరపాలకసంస్థలో 66 మంది కార్పొరేటర్లు ఉండగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్నారు. మొత్తం 69 మంది సభ్యులు నగరపాలకసంస్థలో ఉండగా, సగం 35మంది సభ్యులు తప్పనిసరిగా ఈ ప్రత్యేక సమావేశానికి హాజరుకావాలి. కనీసం 35 సభ్యులుంటేనే కోరం ఉన్నట్లుగా భావించి ఎన్నిక నిర్వహిస్తారు.
ప్రజలకు ప్రవేశం లేదు
మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక సందర్భంగా సో మవారం ప్రజలకు నగరపాలకసంస్థ కార్యాలయంలోనికి అనుమతి లేదని కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ తెలిపారు. ఆదివారం కౌన్సిల్ హాల్‌లో ప్రమాణస్వీకారం, మేయర్ ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల అధి కారి ఆర్‌డీవో మహేశ్వర్‌తో కలిసి పరిశీలించారు.


