మార్కెట్లో రద్దీ.. ఆలయాలు ముస్తాబు
కరీంనగర్ కల్చరల్/విద్యానగర్: శివరాత్రి పూజలకు శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. ఆదివారం శివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం నగరంలోని మార్కెట్లో రద్దీ నెలకొంది. శనివారం వీక్లీ మార్కెట్, ప్రధాన కూరగాయల మార్కెట్, రైతుబజార్, శ్రీవెంకటేశ్వర ఆలయ ప్రాంతం, టవర్ సర్కిల్ పూజా సామగ్రి కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. కిలో ద్రాక్ష రూ.150 నుంచి రూ.180వరకు, దీపపు కంచుళ్లు జత రూ.100, మొక్కజొన్న కంకులు ఒక్కటి రూ.15, మోదుగుపూలు రూ.50 చొప్పున విక్రయించారు. నగరంలోని పాతబజార్ శ్రీగౌరీశంకరాలయం, కమాన్‌రోడ్‌లోని శ్రీరామేశ్వరాలయం, భగత్‌నగర్‌లోని భవానీ శంకరాలయలను శివరాత్రి వేడుకలకు విద్యుత్ దీపాలతో అలంకరించారు.
మార్కెట్లో రద్దీ.. ఆలయాలు ముస్తాబు
మార్కెట్లో రద్దీ.. ఆలయాలు ముస్తాబు
మార్కెట్లో రద్దీ.. ఆలయాలు ముస్తాబు


