నాడు మేయర్.. నేడు కార్పొరేటర్‌గా ఓటమి..
గోదావరిఖని: రామగుండం నగరపాలక మేయర్‌గా పని చేసిన డాక్టర్ బంగి అనిల్‌కుమార్ నేడు కార్పొరేటర్‌గా ఓటమి పాలయ్యారు. 41వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనిల్‌కుమార్ పోటీలో ఉన్నారు. ఈసారి కూడా మేయర్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సీపీఐ అభ్యర్థి మార్కపురి సూర్య చేతిలో ఓటమి పాలయ్యారు. 119 ఓట్ల మెజార్టీతో సూర్య గెలుపొందారు. మేయర్‌గా పని చేసి మళ్లీ మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగిన అనిల్‌కుమార్.. సీపీఐ అభ్యర్థి చేతిలో ఓటమిపాలు కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. డబ్బులు పంచుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఆ తర్వాత పోలీసులు చేరుకొని తనిఖీలు నిర్వహించడం.. సీపీఐ అభ్యర్థి జేబులో రూ.48వేలు దొరకడం.. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మైనస్‌గా మారిందనే చర్చ జరుగుతోంది.


