కేంద్రం నిధులతోనే అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

కేంద్రం నిధులతోనే అభివృద్ధి

Feb 9 2026 7:49 AM | Updated on Feb 9 2026 7:49 AM

కేంద్రం నిధులతోనే అభివృద్ధి

కేంద్రం నిధులతోనే అభివృద్ధి

ఉత్సవమూర్తుల ఊరేగింపు

కరీంనగర్‌: కేంద్రం నిధులతోనే నగరం అభివృద్ధి చెందిందని 42వ డివిజన్‌ బీజేపీ అభ్యర్థి యాదగిరి సునీల్‌ రావు అన్నారు. ఆదివారం డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాలనీవాసులతో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్‌లో జరిగిన అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమైందని తెలిపా రు. స్మార్ట్‌సిటీ కింద కరీంనగర్‌ను ఎంపిక చేసి, తెలంగాణలోనే సుందరమైన నగరంగా కేంద్రం తీర్చిదిద్దిందన్నారు. మేయర్‌ పనిచేసిన ఐదేళ్లలో నగరంతో పాటు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న డివిజన్‌ను సుందరంగా తీర్చిదిద్దానని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చేందుకు ఎంత కృషి చేశారని తెలిపారు. 42వ డివిజన్‌ కార్పొరేటర్‌గా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

శంకరపట్నం: మండలంలోని కొత్తగట్టు, గొల్ల పల్లి గ్రామాల్లో ఆదివారం మత్స్యగిరీంద్రస్వామి ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగించారు. గుట్టపై నుంచి తీసుకువచ్చిన స్వామివారిని గ్రామ వీధుల్లో ఊరేగిస్తుండగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. చైర్మన్‌ కోరెం రాజిరెడ్డి, ఆలయ పూజారులు శేషం ము రళీధరాచార్యులు, మాధవాచార్యులున్నారు.

రెండోరోజు 1,532 ఓట్లు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలక సంస్థలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల ప్రక్రియ కొనసాగుతోంది. రెండవరోజు ఆదివారం 1,532 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 2062 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలయ్యాయి. సోమవారం సైతం ప్రక్రియ కొనసాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement