మల్లన్న బ్రహ్మోత్సవాలకు వేళాయె
● 12 నుంచి ప్రారంభం.. 15న స్వామివారి కల్యాణం
ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 12న నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు మహారాష్ట్రకు చెందిన భక్తులు బ్రహ్మోత్సవాలను తిలకిస్తారు. గురువారం ప్రత్యేక అర్చకులు దూపం వీరభద్రయ్య ఆధ్వర్యంలో అగ్రోదకం, కృద్రాచరణం, శ్రీమహాగణపతిపూజ, గౌరీపూజ, శివపుణ్యహావచనం, నాంది సమారాధానం, రుత్విగ్వరణం, అఖండ దీపస్థాపన, హారతి, మంత్రపుష్పం, సాయంత్రం ధ్వజారోహణం, తీర్థప్రసాద కార్యక్రమాలు జరుగుతాయి. 13న ఉదయం బలిహరణ, దృష్టి కుంభోత్సవం, స్థాపిత మంటపారాధన, అగ్నిప్రతిష్ఠ, రుద్రహవనం నిర్వహిస్తారు. ఉదయం 10ః30గంటలకు భ్రమరాంభ మల్లికార్జునస్వామి కల్యాణం జరుగుతుంది. స్వామివారి కల్యాణానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. 14న నాకబలి, గ్రామోత్సవం, 15న మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5 నుంచి సాయంత్రం 4గంటల వరకు సామూహిక రుద్రాభిషేకం, రాత్రి 8గంటలకు రథోత్సవం, రాత్రి 11ః45గంటలకు మహాహారతి, సాంస్రృతిక కార్యక్రమాలు నిర్వహించున్నట్లు ఆలయ ఆలయ సిబ్బంది వివరించారు.
బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు..
ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో 12 నుంచి మహాశివరాత్రి వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు రానున్న భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు నీడ, ప్రత్యేక పూజలు, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేశాం. భక్తులకు అన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటు చేశాం.
– బి.సదయ్య ఆలయ ఈవో, ఓదెల
మల్లన్న బ్రహ్మోత్సవాలకు వేళాయె
మల్లన్న బ్రహ్మోత్సవాలకు వేళాయె


