వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆందోళన
వేములవాడ: పట్టణంలోని 12వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థికి పోలీసులు మద్దతు ఇస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి రామతీర్థపు కృష్ణవేణి పోలింగ్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. కృష్ణవేణి మాట్లాడుతూ విధుల్లో ఉన్న ఎస్సై బీఆర్‌ఎస్ నాయకులకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అందరిని 100 మీటర్ల దూరంలో ఉంచేశారు. 4వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి తరఫున ఆయన సతీమణి మరొకరి ఐడీ కార్డు మెడలో వేసుకుని పోలింగ్ ఏజెంట్‌గా కూర్చుని ప్రచారం చేసిందని.. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తోట రాజు ఆరోపించారు. పోలీసులు విచారణ చేపట్టి ఆమెను బయటకు పంపించి వేశారు.
కోడ్ ఉల్లంఘించిన ఇద్దరిపై కేసు
వేములవాడలోని 4వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి మారం కుమార్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందున వారి దంపతులపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. పోలింగ్‌స్టేషన్‌లో తన తరఫున ఉన్న ఏజెంట్ ఐడీ కార్డును ఆయన సతీమణి వేసుకుని ఉండడం, పోల్ చీటి వెనుక భాగంలో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ముద్రించిన అంశంపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థి దంపతులపై కేసు


