కొడుకు గెలిచాడన్న ఆనందం.. అంతలోనే విషాదం
పెద్దపల్లిరూరల్: ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలన్న కోరికను తన కొడుకు నదీం ఇటీవల పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో 9వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి నెరవేర్చాడు. కానీ, ఆ సంతోషం చూడకముందే ఆదివారం అతడి తండ్రి మహమ్మద్ సర్వర్ (72) గుండెపోటుతో మృతిచెందాడు. పదేళ్ల క్రితం నగరపంచాయతీ ఎన్నికల్లో సర్వర్, అతడి భార్య పోటీకి దిగి ఓడిపోయారు. ఇటీవల కౌన్సిలర్‌గా తన కొడుకు ఎన్నిక కావడంతో ఎంతో సంతోషడ్డాడు. కానీ, గంటలు గడవక ముందే మృతిచెందడంతో పెద్దపల్లిలో విషాధచాయలు అలుముకున్నాయి. కౌన్సిలర్లతో కలిసి క్యాంపునకు వెళ్లిన నదీం, తండ్రి మరణించాడని సమాచారం అందడంతో పెద్దపల్లికి చేరుకున్నాడు. ఎమ్మెల్యే విజయరమణారావు, పలువురు నాయకులు సర్వర్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
గుండెపోటుతో కౌన్సిలర్ తండ్రి మృతి


