కమల వికాసం! | - | Sakshi
Sakshi News home page

కమల వికాసం!

Feb 17 2026 7:31 AM | Updated on Feb 17 2026 7:31 AM

కమల వ

కమల వికాసం!

పార్టీల బలాబలాలు.. వచ్చిన ఓట్లు :

నగర అభివృద్ధికి కృషిచేస్తా

మేయర్‌ స్థానానికి అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లు

మేయర్‌గా కొలగాని శ్రీనివాస్‌

డిప్యూటీ మేయర్‌గా సునీల్‌రావు

చివరకు ‘చేయి’చ్చిన బీఆర్‌ఎస్‌

గులాబీ సహాయంతో గట్టెక్కిన కమలం

ఓటేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌

డిప్యూటీ మేయర్‌

స్థానానికి అభ్యర్థుల

వారీగా వచ్చిన ఓట్లు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌/కరీంనగర్‌కార్పొరేషన్‌:

గరపాలకసంస్థపై బీజేపీ కాషాయ జెండా ఎగురవేసింది. ఉత్కంఠ, నాటకీయ పరిణామాల నడుమ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను ఆ పార్టీ సొంతం చేసుకుంది. కరీంనగర్‌ మున్సిపల్‌ చరిత్రలో తొలిసారి బీజేపీ మేయర్‌ పీఠాన్ని దక్కించుకుంది. మేయర్‌గా కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌గా మాజీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ శిబిరంతో అంటగాగుతూ వచ్చిన బీఆర్‌ఎస్‌ చివరికి చేయిచ్చింది. కీలకమైన ఎన్నిక సమయంలో ఓటింగ్‌కు దూరంగా ఉండడంతో బీజేపీ గట్టెక్కింది.

క్యాంప్‌ల నుంచి కార్యాలయానికి..

ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకారం సోమవారం నగరపాలక కార్యాలయంలోని కౌన్సిల్‌ హాల్‌లో సభ్యుల ప్రమాణ స్వీకారం, మేయర్‌, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు తమ సభ్యులు, స్వతంత్రులతో క్యాంప్‌లకు వెళ్లడం తెలిసిందే. మేయర్‌ ఎన్నిక సందర్భంగా వారంతా క్యాంప్‌ల నుంచి నేరుగా నగరపాలక కార్యాలయానికి చేరుకున్నారు. కళాభారతి వైపు గేట్‌ నుంచి ముందుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ రాగా, బీజేపీ కార్పొరేటర్లు బస్సులో వచ్చారు. కొద్దిసేపటి తర్వాత కాంగ్రెస్‌ కార్పొరేటర్లు, తమకు మద్దతునిస్తున్న ఎంఐఎం, ఏఐఎఫ్‌బీ, స్వతంత్ర కార్పొరేటర్లతో కలిసి మార్కెట్‌ వైపు గేట్‌ నుంచి బస్సులో కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, లైబ్రరీ చైర్మన్‌ సత్తు మల్లేశం కోసం కొద్దిసేపు ఎదురుచూసిన తర్వాత కార్పొరేటర్లు కార్యాలయానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌లు వచ్చారు. అంతకుముందు స్వతంత్ర అభ్యర్థి బీఆర్‌ఎస్‌లో చేరారు.

బీజేపీకి 34.. కాంగ్రెస్‌కు 21

కొత్తగా ఎన్నికై న సభ్యులతో ఎన్నికల అధికారి, ఆర్డీవో మహేశ్వర్‌ మొదట తెలుగు అక్షరమాల ప్రకారం ప్రమాణస్వీకారం చేయించారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ప్రమాణ స్వీకారం జరిగింది. అనంతరం 12.30 గంటలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌లకు పోటీ ఏర్పడడంతో ఎన్నిక నిర్వహించారు. మేయర్‌ అభ్యర్థిగా బీజేపీ నుంచి కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థిగా యాదగిరి సునీల్‌రావు, కాంగ్రెస్‌ నుంచి మేయర్‌ అభ్యర్థిగా ఆకుల నర్మద, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థిగా హీనా అఫ్రీన్‌ బరిలో నిలిచారు. వీరికి పార్టీ బీ ఫాం అందించారు. ఆకుల నర్మదను వైద్యుల అంజన్‌కుమార్‌ ప్రతిపాదించగా, గుమ్మడి రాజ్‌కుమార్‌ బలపరిచారు. ఓటింగ్‌ నిర్వహించడంతో కాంగ్రెస్‌ సభ్యులు 14 మంది, ముగ్గురు స్వతంత్రులు, ముగ్గురు ఎంఐఎం సభ్యులు, ఒక ఫార్వర్డ్‌ బ్లాక్‌ సభ్యురాలు ఓటు వేశారు. నర్మదకు మొత్తం 21 ఓట్లు వచ్చాయి. చేతులెత్తే పద్ధతిన కాకుండా ఓటు అని రాసి ఉన్న ఫ్లకార్డును ఎత్తి ఓటు వేశారు. అనంతరం బీజేపీ మేయర్‌ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్‌ను మాసం గణేశ్‌ ప్రతిపాదించగా, పెద్దపల్లి శ్రీలేఖ బలపరిచారు. శ్రీనివాస్‌కు మద్దతుగా 30 మంది బీజేపీ, ముగ్గురు స్వతంత్ర, ఎక్స్‌ అఫిషియో సభ్యుని హోదాలో బండి సంజయ్‌ ఓటు వేశారు. మొత్తం 34 ఓట్లు శ్రీనివాస్‌కు వచ్చాయి. డిప్యూటీ మేయర్‌గా సునీల్‌రావు పేరును సోమిడి వేణు ప్రతిపాదించగా, బండారి వేణు బలపరిచారు. ఆయనకు కూడా 34 ఓట్లు వచ్చాయి. దీంతో మేయర్‌గా కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌గా యాదగిరి సునీల్‌రావు ఎన్నికై నట్లు ప్రకటించారు. కాగా సమావేశానికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరైనా, వెంటనే వెళ్లిపోవడంతో ఆయన ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా ఓటు వేయలేదు. అలాగే మరో ఎక్స్‌ అఫిషియో, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ దూరంగా ఉన్నారు.

ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరం

బల్దియాలో ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో క్యాంప్‌ రాజకీయాలకు తెరలేవడం, ఫార్వర్డ్‌బ్లాక్‌ సభ్యులు అటూ ఇటు క్యాంప్‌లు మారడం, స్వతంత్రులు రెండు శిబిరాల్లో చేరడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. అనూహ్యంగా కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ మద్దతు పలకడం, ఒక ఫార్వర్డ్‌ బ్లాక్‌ సభ్యురాలు బీజేపీ నుంచి కాంగ్రెస్‌ శిబిరంలోకి చేరడంతో, కాంగ్రెస్‌ బలం 35కు చేరుకుంది. దీంతో కాంగ్రెస్‌కూటమి మేయర్‌ పీఠం దక్కించుకోవడం ఖాయంగా కనిపించింది. కానీ, ఆదివారం అర్ధరాత్రి పరిస్థితి ఒక్కసారిగా మారింది. కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తూ వచ్చిన బీఆర్‌ఎస్‌ చివరి సమయంలో బీజేపీ వైపు మొగ్గు చూపింది. నేరుగా ఓటు వేయకపోయినా, కోరం కోసం మీటింగ్‌కు హాజరై, ఓటింగ్‌కు మాత్రం దూరంగా ఉంది. దీంతో బీజేపీ 13 ఓట్ల తేడాతో విజయం సాధించింది. బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు 9 మంది, ఇద్దరు స్వతంత్రులు ఓటింగ్‌లో పాల్గొనలేదు. మేయర్‌ పీఠాన్ని ఆశించిన కొమురయ్య కూడా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

బాధ్యతలు స్వీకరిస్తున్న మేయర్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ సునీల్‌రావు

యాదగిరి సునీల్‌రావు (బీజేపీ):

మేయర్‌ ప్రొఫైల్‌

పేరు: కొలగాని శ్రీనివాస్‌

వయస్సు: 37 సంవత్సరాలు

విద్యార్హతలు: ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ

చిరునామా: తీగలగుట్టపల్లి, కరీంనగర్‌

రాజకీయ నేపథ్యం: ఆర్‌ఎస్‌ఎస్‌లో 2013 లోనే ప్రాథమిక శిక్షణ పూర్తి చేశారు. ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌వైపీ, ఏక్తా పరిషత్‌ సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు. 2005 నుంచి 2007 వరకు అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్‌లో, 2007 నుంచి 2009 వరకు భారతీయ జనతా యువ మోర్చాలో, 2014 నుంచి 2019 వరకు బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా, 2020 నుంచి 2025 వరకు 1వ డివిజన్‌ కార్పొరేటర్‌గా సేవలందించారు.

నగర అభివృద్ధికి కృషి చేస్తానని కొలగాని శ్రీనివాస్‌ అన్నారు. సామాన్య కార్యకర్తలకు ఉన్నత పదవులు కేవలం బీజేపీలోనే సాధ్యమని నగర మేయర్‌ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సహకారంతో తెలిపారు. సోమవారం మేయర్‌గా ఎన్నికై న అనంతరం మీడియాతో మాట్లాడారు. బీజేపీ గెలుపు కోసం కష్టపడిన ప్రతీ కార్యకర్తకు ధన్యవాదాలు చెప్పారు. గతంలో స్మార్ట్‌ సిటీ నిధులు తెచ్చి నగరాన్ని అభివృద్ధి చేసినట్లుగానే, నగరాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, కార్పొరేటర్లు వంగల పవన్‌కుమార్‌, బండారి వేణు తదితరులు పాల్గొన్నారు.

తొలిసారి మేయర్‌ పీఠంపై బీజేపీ

కరీంనగర్‌ బల్దియాను బీజేపీ తొలిసారి దక్కించుకుంది. నగరపాలకసంస్థగా ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్‌ ఒకసారి, బీఆర్‌ఎస్‌ రెండు పర్యాయాలు అధికారం దక్కించుకున్నాయి. అంతకుముందు మున్సిపాల్టీగా ఉన్న సమయంలోనూ బీజేపీ ఒకటి, రెండు స్థానాలకే పరిమితమైంది. ఈ సారి మేయర్‌, డిప్యూటి మేయర్‌ పీఠాలను కై వసం చేసుకొని, చిరకాల కల నెరవేర్చుకుంది.

కొలగాని శ్రీనివాస్‌ (బీజేపీ):

కమల వికాసం!1
1/4

కమల వికాసం!

కమల వికాసం!2
2/4

కమల వికాసం!

కమల వికాసం!3
3/4

కమల వికాసం!

కమల వికాసం!4
4/4

కమల వికాసం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement