కౌంట్‌డౌన్‌! | - | Sakshi
Sakshi News home page

కౌంట్‌డౌన్‌!

Feb 13 2026 3:49 AM | Updated on Feb 13 2026 3:49 AM

కౌంట్

కౌంట్‌డౌన్‌!

బల్దియాల వివరాలు

పార్టీలకు సానుకూలత ఇక్కడే

నేడే బల్దియా ఎన్నికల ఫలితాలు

నాలుగు జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి

13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లలో

5 చోట్ల బీఆర్‌ఎస్‌కు, రెండు చోట్ల బీజేపీకి సానుకూలత

8 చోట్ల కాంగ్రెస్‌కు సునాయాస విజయం

క్యాంపు రాజకీయాలకు సిద్ధమైన ప్రధానపార్టీలు

ఇండిపెండెంట్లతో పార్టీల ముందస్తు ఒప్పందాలు

మధ్యాహ్నంలోగా 126 డివిజన్లు, 341 వార్డుల రిజల్ట్స్‌

తేలనున్న 2,286 మంది భవితవ్యం

టిక్‌.. టిక్‌.. టిక్‌

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:

మ్మడి కరీంనగర్‌ జిల్లా మున్సిపల్‌ రాజకీయాల్లో నేడు కీలక ఘట్టం జరగనుంది. జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు బుధవారం ఎన్నికలు జరగగా, ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. రెండు కార్పొరేషన్లలో 126 డివిజ న్లకు, 13 మున్సిపాలిటీలలో 341 వార్డుల ఫలితా లకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్‌ జిల్లాలో 764, జగిత్యాల 655, పెద్దపల్లి 580, సిరిసిల్ల 287 మొత్తం 2,286 మంది భవితవ్యం నేడు తేలనుంది. పోలింగ్‌ ముగిసిన వెంటనే ప్రధాన పార్టీల్లో లెక్కలు మొదలయ్యాయి. ఎగ్జిట్‌ ట్రెండ్స్‌ ప్రకారం ఉమ్మడి జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశముందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐదు చోట్ల బీఆర్‌ఎస్‌కు ఆధిక్యం కనిపిస్తుండగా, రెండు చోట్ల బీజేపీకి గెలుపు అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఎనిమిది మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు సునాయాస విజయం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

క్యాంపు రాజకీయాలు..

ఫలితాలు వెలువడగానే క్యాంపు రాజకీయాలు మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీల నేతలు ఇండిపెండెంట్‌ అభ్యర్థులతో ముందస్తు ఒప్పందాలకు సిద్ధమవుతున్నారు. హంగ్‌ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రతి ఒక్క కార్పొరేటర్‌/కౌన్సిలర్‌ ఓటు కీలకంగా మారనుంది. అధికార కాంగ్రెస్‌ పార్టీ కొన్నిచోట్ల అభ్యర్థులను గురువారమే క్యాంపునకు తరలించింది. రామగుండం, మంథని, సుల్తానాబాద్‌, పెద్దపల్లి, చొప్పదండి, కోరుట్ల, ధర్మపురి, వేములవాడలో అభ్యర్థులను క్యాంపుకు రావాలని ఆదేశాలిచ్చింది. బీఆర్‌ఎస్‌ కూడా కరీంనగర్‌, రామగుండం, సిరిసిల్ల, హుజూరాబాద్‌, జమ్మికుంట, మెట్‌పల్లి, రాయికల్‌లో క్యాంపు రాజకీయానికి తెరలేపారు. కరీంనగర్‌, వేములవాడలో క్యాంపు కోసం బీజేపీ అభ్యర్థులను సిద్ధంగా ఉండాలని సూచించింది.

తారుమారు కానున్న స్థానిక రాజకీయం

పుర ఫలితాలు స్థానిక రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. రాష్ట్రస్థాయిలో మారుతున్న రాజకీ య సమీకరణాలకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కేంద్రంగా మారే అవకాశముంది. అధికార పార్టీ తమపట్టును నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఉండగా, ప్రతిపక్షాలు బలమైన ప్రాతినిథ్యం సాధించి భవిష్య త్‌ ఎన్నికలను శాసించేందుకు సిద్ధమవుతున్నాయి. శుక్రవారం వెలువడే ఫలితాలు కేవలం మున్సిపల్‌ పాలనకే కాదు, జిల్లాలో భవిష్యత్‌ రాజకీయ దశ, దిశను నిర్ణయించనున్నాయి. అధికార కుర్చీ కోసం జరుగుతున్న ఈ పోరు ఉమ్మడి రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.

కరీంనగర్‌ డివిజన్లు: 66చొప్పదండి వార్డులు: 14హుజూరాబాద్‌ వార్డులు: 30 జమ్మికుంట వార్డులు : 30

కాంగ్రెస్‌: రామగుండం, మంథని,

సుల్తానాబాద్‌, పెద్దపల్లి, చొప్పదండి, కోరుట్ల,

ధర్మపురి, వేములవాడ

బీఆర్‌ఎస్‌: మెట్‌పల్లి, రాయికల్‌, హుజూరాబాద్‌, జమ్మికుంట, సిరిసిల్ల

బీజేపీ: కరీంనగర్‌, వేములవాడ

కౌంట్‌డౌన్‌!1
1/1

కౌంట్‌డౌన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement