స్ట్రాంగ్‌రూమ్‌ ఘటనపై విచారణ చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

స్ట్రాంగ్‌రూమ్‌ ఘటనపై విచారణ చేపట్టాలి

Feb 15 2026 6:56 AM | Updated on Feb 15 2026 6:56 AM

స్ట్రాంగ్‌రూమ్‌ ఘటనపై విచారణ చేపట్టాలి

స్ట్రాంగ్‌రూమ్‌ ఘటనపై విచారణ చేపట్టాలి

● హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యంపై తీవ్ర అనుమానాలు కలిగిస్తున్నాయని స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని కేసీ క్యాంపులో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు పూర్తికాకముందే కాంగ్రెస్‌ నాయకులు తమకు ఇన్ని సీట్లు వస్తాయని ముందుగానే ప్రకటించడం యాధృచ్ఛికంగా ఉందన్నారు. ఎవరికెన్ని సీట్లు వస్తాయో ముందే చెప్పడం మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగినట్లే అనిపిస్తోందన్నారు. స్ట్రాంగ్‌రూం తాళాలు పగలగొట్టడం, సీసీ కెమెరా ఫుటేజ్‌ తొలగించడం వంటి ఘటనలు సందేహాలకు తావిస్తోందన్నారు. పోలీసులు, ఎన్నికల యంత్రాంగం ఎవరి కోసం పనిచేస్తోందని ప్రశ్నించారు. జరిగిన ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. సీసీటీవీ డేటా రికవరీ చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు బండ శ్రీనివాస్‌, గందె శ్రీనివాస్‌, వర్ధినేని రవీందర్‌రావు, మారపల్లి సుశీల, కొండల్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement