లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
కరీంనగర్: అల్ట్రాసౌండ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ చేస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ అన్నారు. శుక్రవారం కరీంనగర్‌లోని పలు అల్ట్రాసౌండ్ కేంద్రాలను తనిఖీ చేశారు. రిజిస్టర్లు, పేషెంట్ అనుమతి పత్రాలు, కేస్ రికార్డులు, సంబంధిత డాక్యుమెంట్లు, ఫామ్–ఎఫ్ పత్రాలు పరిశీలించారు. ప్రత్యేక వైద్య నిపుణులైన గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు, ఇతర అర్హత కలిగిన నిపుణుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, హాస్పిటల్ రిజిస్ట్రేషన్ పత్రాలు ధృవీకరించారు. సిజేరియన్ కాన్పులు తగ్గించే దిశగా ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్‌లోని కేస్ షీట్లను ఆడిట్ చేశారు. పీవోడీటీటీ ఉమాశ్రీ, పీవో ఎంహెచ్‌ఎన్ సన జవేరియా, సయ్యద్ సాబీర్, రమేశ్ పాల్గొన్నారు.


