తీర్థయాత్రలకు రైల్వే ప్రత్యేక ప్యాకేజీలు | - | Sakshi
Sakshi News home page

తీర్థయాత్రలకు రైల్వే ప్రత్యేక ప్యాకేజీలు

Feb 18 2026 6:58 AM | Updated on Feb 18 2026 6:58 AM

తీర్థయాత్రలకు రైల్వే ప్రత్యేక ప్యాకేజీలు

తీర్థయాత్రలకు రైల్వే ప్రత్యేక ప్యాకేజీలు

ప్యాకేజీ వివరాలు..

సౌకర్యాలు ఇవే..

కరీంనగర్‌రూరల్‌: తీర్ధయాత్రలకు వెళ్లే భక్తులు కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడిపిస్తోందని ఐఆర్‌సీటీసీ టూరిజం అసిస్టెంట్‌ మేనేజర్‌ వెంకటేశ్‌ తెలిపారు. మంగళవారం కరీంనగర్‌ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమాశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ప్రజల కోసం మార్చి 21 నుంచి మే 21వ తేదీ వరకు 4 ప్రత్యేక ప్యాకేజీలను ‘భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలు’ ద్వారా హైదరాబాద్‌ నుంచి వర్తింపజేస్తామన్నారు.

జ్యోతిర్లింగంతో (ఎస్‌సీజెడ్‌బీజీఎ–53): తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు యాత్ర మార్చి 21న ప్రారంభమై 28 వరకు ఉంటుంది. ఒక్కొక్కరికి సాధారణ టికెట్‌ రూ.14,700, 3 ఏసీ రూ.22,300 ఉంటే.. 2 ఏసీ రూ.28,700గా నిర్ణయించారు. ఈ యాత్ర సికింద్రాబాద్‌, జనగాం, కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా సాగుతుంది.

సప్తజ్యోతిర్లింగ దర్శన్‌యాత్ర (ఎస్‌సీజెడ్‌బీజీ–55): ఉజ్జయిని(మహాకాళేశ్వర్‌ – ఓంకారేశ్వర్‌), ద్వారక(నాగేశ్వర్‌), సోమనాథ్‌(సోమ్నాథ్‌), పుణే(భీమశంకర్‌), నాసిక్‌(త్రయంబకేశ్వర్‌), ఔరంగాబాద్‌(గ్రీష్ణేశ్వర్‌). ఈయాత్ర ఏప్రిల్‌ 14 నుంచి 24 వరకు సాగుతుంది. సాధారణ టికెట్‌ రూ.17,600 కాగా 3, ఏసీ రూ.26,700గా, 2 ఏసీ రూ.34,600గా నిర్ణయించారు. సికింద్రాబాద్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, ధర్మాబాద్‌, ముద్ఖేడ్‌, నాందేడ్‌, పూర్ణ మీదుగా యాత్ర సాగుతుంది.

అయోధ్య–కాశీ: బైద్యనాథ్‌ ధామ్‌ దర్శన్‌ యాత్ర : పూరి, కోణార్క్‌, బైద్యనాథ్‌ధామ్‌, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్‌. ఏప్రిల్‌ 28 నుంచి మే 5 వరకు సాగుతుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్‌ రూ.16,700 కాగా, 3 ఏసీ రూ.26,100 కాగా, 2 ఏసీ రూ.34,100గా ఉంటుంది. సికింద్రాబాద్‌, కాజీపేట, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా రైలు వెళ్తుంది.

హరిద్వార్‌ – మాతావైష్ణోదేవి–రిషికేశ్‌: మధుర, బృందావనం, మాతావైష్ణోదేవి, హరిద్వార్‌, రిషికేశ్‌. మే 12 నుంచి మే 21 వరకు ఉంటుంది. ఒక్కొక్కరికి సాధారణ టికెట్‌ రూ.16,500 కాగా, 3 ఏసీ రూ.25,700, 2 ఏసీ రూ. 33,400గా ఉంటుంది. సికింద్రాబాద్‌, జనగాం, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బల్హర్షా, వార్ధా, నాగ్‌పూర్‌ మీదుగా సాగుతుంది.

ఐఆర్‌సీటీసీ అసిస్టెంట్‌ మేనేజర్‌ వెంకటేశ్‌

రైలు, బస్సు, హోటల్‌.. అన్ని భోజనాలు(ఉదయం అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం), వాటర్‌ బాటిల్‌, టూర్‌ ఎస్కార్ట్‌ సేవలతో సందర్శన స్థలాలు, (అదనపు ఖర్చు లేదు). ప్రయాణ బీమా ఉంటుంది. రైల్వేస్టేషన్‌ నుంచి ఆలయాల వరకు ఉచితం. ప్రతీ రైలులో 705 మంది ప్రయాణికులు ఉంటారు. ప్రతీ 70 మందికి ఇద్దరు కో ఆర్డినేటర్లు అందుబాటులో ఉండి సౌకర్యాలు కల్పిస్తారు. సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుంది. వివరాలకు 97013 60701, 92810 30727, 928103 0759 నంబర్లలో సంప్రదించండి. ఆన్‌లైన్‌లో ((www.irctcoturirm.com)) వైబ్‌సైట్‌ను సంప్రదించాలి. టూరిజం మానిటర్స్‌ ప్రశాంత్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement