గేటు పడింది.. అంబులెన్స్‌ ఆగింది | - | Sakshi
Sakshi News home page

గేటు పడింది.. అంబులెన్స్‌ ఆగింది

Feb 19 2026 9:29 AM | Updated on Feb 19 2026 9:29 AM

గేటు పడింది.. అంబులెన్స్‌ ఆగింది

గేటు పడింది.. అంబులెన్స్‌ ఆగింది

రైల్వే గేటు వద్ద ఆగిన అంబులెన్స్‌

కరీంనగర్‌–జగిత్యాల జాతీయ రహదారిలో గంగాధర మండలం మంగపేట సమీపంలోని రైల్వే గేటు వాహనదారులకు సంకటంగా మారింది. గేటు పడితే అరగంటకు పైగా వేచి ఉండాల్సి వస్తోంది. బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని అంబులెన్స్‌లో జగిత్యాల వైపు నుంచి కరీంనగర్‌ తీసుకెళ్తున్నారు. మంగపేట వద్ద రైలు గేటు పడింది. దీంతో అంబులెన్సు అరగంటపాటు అక్కడే ఆగింది. ప్రతిరోజు పదికి పైగా రైళ్లు ఈ లైన్‌లో రాకపోకలు సాగిస్తుంటాయని, వాహనదారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

– గంగాధర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement