‘కాపు’ల ఖాతాలో బల్దియా
కరీంనగర్ కార్పొరేషన్: ఉమ్మడి జిల్లా కేంద్రమైన కరీంనగర్ అరుదైన సామాజిక రాజకీయానికి కేంద్రంగా మారింది. కరీంనగర్ నగర మేయర్, నగరానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, ఎంపీలు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడమే ఆ ప్రత్యేకత. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు. వీరిరువురికి తోడు సోమవారం మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన కొలగాని శ్రీనివాస్ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. ఇలా ఒకే సమయంలో ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలు మేయర్, ఎమ్మెల్యే, ఎంపీగా ఉండడం కరీంనగర్ చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం. గతంలో మేయర్‌గా డి.శంకర్, ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్, ఎంపీగా పొన్నం ప్రభాకర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు తొలిసారిగా ఒకే సమయంలో కరీంనగర్‌కు ప్రాతినిథ్యం వహించారు. కానీ, ప్రస్తుతం ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలే మేయర్, ఎమ్మెల్యే, ఎంపీగా ఉండడంతో ఆ సామాజిక వర్గ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బండి
సంజయ్
కొలగాని శ్రీనివాస్
గంగుల
కమలాకర్
‘కాపు’ల ఖాతాలో బల్దియా
‘కాపు’ల ఖాతాలో బల్దియా


