సంతోషంగా ఉంది
హైదరాబాద్ నారాయణ గూడలోని ఆర్‌బీవీఆర్‌ఆర్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నందుకు సంతోషంగా ఉంది. ఓటు మన జన్మ హక్కు. దాన్ని సద్విని యోగం చేసుకుంటా. అవినీతిపరులకు కాకుండా అభివృద్ధికి పాటుపడే వ్యక్తికి ఓటేస్తా.
– ఆవుదరి సిరిచందన, రాంనగర్
హైదరాబాద్‌లోని ఓరాకిల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నా. గత సంవత్సరం ఓటు నమోదు చేయించుకున్నా. మున్సిపల్ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వినియోగించుకోనున్నాను. మనది ప్రజాస్వా మ్య వ్యవస్థ. కీలకమైనది, అత్యంత విలువైనది దేశం కల్పించిన హక్కు ఓటు. ఓటు సక్రమంగా వినియోగిస్తే నిజాయితీపరులు ఎన్నికవుతారు.
– పల్లెర్ల స్నేహిత, అశోక్‌నగర్
గచ్చిబౌలిలోని నియట్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఓటేయడం ఎంతో ముఖ్యం. ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యమిస్తూ.. అభివృద్ధి కోసం, ప్రజలకు స్వార్థం లేకుండా సేవలందించాలనే ఉద్దేశంతో పోటీలో నిలబడిన వారిని గుర్తించి ఓటెయ్యాలి.
– నరాల సాయి మనుహార్ష్
సంతోషంగా ఉంది
సంతోషంగా ఉంది


