నిరుద్యోగులకు అండగా కోడింగ్‌ ట్యూటర్‌ | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు అండగా కోడింగ్‌ ట్యూటర్‌

Feb 9 2026 7:51 AM | Updated on Feb 9 2026 7:51 AM

నిరుద్యోగులకు అండగా కోడింగ్‌ ట్యూటర్‌

నిరుద్యోగులకు అండగా కోడింగ్‌ ట్యూటర్‌

● కరీంనగర్‌లో ఐటీ కెరీర్‌ గైడెన్స్‌పై అవగాహన

కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని నిరుద్యోగ యువతకు కోడింగ్‌ ట్యూటర్‌ అండగా ఉంటుందని కోడింగ్‌ ట్యూటర్‌ నిర్వాహకులు ఫణిరాజ్‌ జాలిగామ అన్నారు. ఐటీ రంగంలోకి రావాలనుకునే అభ్యర్థులు, నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులకు కోడింగ్‌, స్కిల్‌ మేనేజ్‌మెంట్‌పై ఆదివారం కరీంనగర్‌లోని శ్వేత హోటల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో ఫణిరాజ్‌ జాలిగామ మాట్లాడుతూ యువతకు ఐటీ రంగంపై స్పష్టమైన అవగాహన కల్పించాలనే లక్ష్యంతోనే ఐటీ జాబ్‌మేళా, ఇంటర్న్‌షిష్‌, కెరీర్‌ గైడెన్స్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిగ్రీ, ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన వారు, గ్రాడ్యుయేషన్‌ పూర్తయి నాలుగైదేళ్లు గ్యాప్‌ ఉన్న వారు, ఐటీ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ కోచింగ్‌ ఇచ్చి మంచి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఏఐ ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో కోడింగ్‌ నేర్చుకునేందుకు ఇంటర్న్‌షిప్‌ చేస్తే లాభా లేంటనే అంశంపై వివరించారు. కోడింగ్‌, స్కిల్స్‌ కోసం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కోడింగ్‌ట్యూటర్‌ ఆఫీస్‌కు 9 నెలల పాటు వచ్చి నేర్చుకోవాల్సి ఉంటుందని సూచించారు. కోచింగ్‌ పూర్తయిన తర్వాత ఎంప్లాయీమెంట్‌ రాకపోయినా తమ కంపెనీలోనే అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement