అమ్మా.. నీకే అంకితం..
రాయికల్: రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డులో 70 ఏళ్ల మచ్చ గంగలక్ష్మి కాంగ్రెస్ పార్టీ నుంచి 223 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పోలింగ్ కేంద్రంలో కుమారుడు శేఖర్ ఆమె కాళ్లకు దండం పెడుతూ.. ఈ గెలుపు నీకు అంకితమనడం అందరి హృదయాలను కదిలించింది.
వరుస గెలుపులు
హుజూరాబాద్: మేజర్ గ్రామ పంచాయతీ హుజూరాబాద్ మున్సిపల్‌గా ఏర్పాటైన నుంచి పట్టణంలోని సూపర్‌బజార్ ఏరియా 26 వార్డులో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కేసిరెడ్డి లావణ్య–నర్సింహారెడ్డి వరసగా 2006, 2014, 2020, 2026 మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు.
డిపాజిట్ దక్కని
మాజీ చైర్మన్
రాయికల్: రాయికల్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు 7వ వార్డులో పోటీ చేయగా.. డిపాజిట్ సైతం దక్కలేదు. బీఆర్‌ఎస్‌కు చెందిన ఎలిగేటి లలితకు 565 ఓట్లు రాగా.. మోర హన్మండ్లుకు 109, బీజేపీ అభ్యర్థి సామాల్ల రాజేశంకు 36, కోన రాజుకు 46 ఓట్లు మాత్రమే వచ్చాయి.
రాయికల్‌లో అత్యధికం..
702 ఓట్లు
రాయికల్: రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాల్లో 4వ వార్డు కౌన్సిలర్ తురగ సౌజన్యకు అత్యధికంగా 702 ఓట్లు రాగా.. అత్యల్పంగా 8వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థి మ్యాకల జనార్దన్‌కు కేవలం 3 ఓట్లు మాత్రమే వచ్చాయి.
మాజీ చైర్మన్, వైస్ చైర్మన్ ఓటమి
రాయికల్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి శుక్రవారం వెలువడిన ఫలితాల్లో ఓటమి పాలయ్యారు. 7వ వార్డులో మోర హన్మండ్లు ఎలిగేటి లతికపై, 9వ వార్డులో రమాదేవి బత్తిని మహేశ్వరిపై పరాజయం పాలయ్యారు.
అంతస్తు ముందు..
అభిమానం నెగ్గింది
సిరిసిల్లటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో అంతస్తుల ముందు అభిమానం గెలిచింది. కార్మిక క్షేత్రం సిరిసిల్లలోని 33వ వార్డులో బీజేపీ నుంచి పోటీ చేసిన కొండ వర్షిణి దంపతులకు ఉండడానికి భవనం లేదు. భర్త నరేశ్‌కు పెద్దల నుంచి వచ్చిన పది సాంచాలను నడిపిస్తూ సాధారణ జీవితం సాగిస్తున్నారు. చాలా ఏళ్లుగా బీజేపీకి విధేయంగా పని చేస్తున్నారు. రాజకీయంగా ఎలాంటి అండదండలు లేవు. వీరి సేవలను గుర్తించి ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చింది. బీఆర్‌ఎస్ అభ్యర్థి దార అశోక్‌పై 67 ఓట్ల మెజార్టీతో వర్షిణి గెలిచారు. ఈ విషయం సిరిసిల్లలో హాట్ టాపిక్‌గా మారింది.
అమ్మా.. నీకే అంకితం..
అమ్మా.. నీకే అంకితం..


