● వేములవాడలో మాంసం మాయ | - | Sakshi
Sakshi News home page

● వేములవాడలో మాంసం మాయ

Feb 9 2026 7:51 AM | Updated on Feb 9 2026 7:51 AM

● వేమ

● వేములవాడలో మాంసం మాయ

● వేములవాడలో మాంసం మాయ ● 23వ డివిజన్‌ ‘కాపు’ స్పెషల్‌ ● ఎన్నికల వేళ ఓ ఇంటి యజమాని నిరసన ● మా ఇంటికి రాకండి... అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు ● తప్పిన ప్రమాదం మీకెందుకు ఓటేయాలి..?

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): కార్పొరేషన్‌ పరిధిలోని ఫెర్టిలైజర్‌సిటీ(ఎఫ్‌సీఐ)టౌన్‌షిప్‌లోని డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌ 2000–01 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు 25ఏళ్ల రీయూనియన్‌ సమావేశం ఆదివారం హైదరాబాద్‌లోని డ్రీమ్‌ వ్యాలీ రిసార్ట్స్‌లో నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్థిరపడిన వారంతా ఒకేవేదికపైకి చేరారు. బాల్యంలోని స్వర్ణయుగాన్ని గుర్తుచేసుకుంటూ పాఠశాలలో గడిపిన మధురమైన క్షణాలను ఆనందంగా పంచుకున్నారు. ఎఫ్‌సీఐ టౌన్‌షిప్‌లో గడిపిన రోజులను శ్రీభూమిపై స్వర్గంశ్రీగా అభివర్ణిస్తూ స్నేహాలు, ఆటలు, ఉత్సాహభరితమైన వాతావరణాన్ని స్మరించుకున్నారు. తరగతి గదులు, ఆటస్థలాలు, గురువుల మార్గదర్శనం, స్నేహితులతో గడిపిన చిరునవ్వుల రోజులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడం వారికి అపూర్వమైన ఆనందాన్ని ఇచ్చింది. సభ్యులంతా తమ జీవిత ప్రయాణాలు, వత్తిపరమైన అనుభవాలు, విజయాలను పంచుకుంటూ భవిష్యత్‌లో ఇలాంటి సమావేశాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు.

రోడ్డుపై పడిన బండరాయి

చిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని సీతారాంపూర్‌ స్టేజీ వద్ద హుస్నాబాద్‌– కరీంనగర్‌ ప్రధాన రహదారిపై గ్రానైట్‌ లారీ నుంచి బండరాయి పడిపోయింది. ఆదివారం మధ్యాహ్నం బొమ్మనపల్లి గ్రానైట్‌ క్వారీ నుంచి ఆసిఫ్‌నగర్‌కు కటింగ్‌ నిమిత్తం లారీలో తీసుకెళ్తుండగా కరీంనగర్‌ నుంచి హుస్నాబాద్‌ వైపు వస్తున్న కారును తప్పించబోయిన, డ్రైవర్‌ బ్రేక్‌ వేయడంతో గ్రానైట్‌ రాయి లారీ నుంచి రహదారిపై పడింది. గ్రానైట్‌ రాయి పడినచోట రహదారి పూర్తిగా ధ్వంసమైంది. చిగురుమామిడి ఏఎస్సై తిరుపతి ఘటనా స్థలానికి వెళ్లి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. గుంతపడిన చోట మట్టితో పూడ్చివేయించారు.

వేములవాడ: ఆదివారం అంటే చికెన్‌, మటన్‌ ప్రియులు ప్రత్యేకంగా రుచి వైపు మగ్గుతారు. అయితే మున్సిపల్‌ ఎన్నికలకు ఈ ఆదివారమే చివరిది కావడంతో మటన్‌, చికెన్‌ బిర్యాని పొట్లాలతో అభ్యర్థులు తమ వార్డుల్లో హడావుడి చేస్తూ వారి అనుయాయులు, ఓటర్లకు ముందస్తు పండుగ చూపించారు. మున్సిపల్‌ ఎన్నికలు ఈనెల 11న జరగనున్న నేపథ్యంలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. ఇంటింటి ప్రచారంతోపాటు, ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వినూత్న మార్గాలు అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం వేములవాడలోని పలు వార్డుల్లో మటన్‌, చికెన్‌ పొట్లాల పంపిణీ జోరుగా సాగింది. ఒకవైపు అభివృద్ధి హామీలు, మరోవైపు సంక్షేమ పథకాల మాటలు వినిపిస్తుండగా మరోవైపు పొట్లాల రాజకీయాలు చర్చకు దారితీస్తున్నాయి. ఓటు వేయించే ముందు కడుపు నింపితే సరిపోతుందా? అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. అయినా ఎన్నికల వేళ ఇలాంటి పరిణామాలు కొత్తేమీ కాదని పలువురు పేర్కొంటున్నారు. బ్యాలెట్‌ బాక్స్‌ దగ్గర ఫలితం ఎలా ఉంటుందో చూడాలి కానీ, ఆదివారం మాత్రం చాలా ఇళ్లలో రాజకీయ రుచితో భోజనాలు జరిగాయని మాత్రం చెప్పొచ్చు.

పంపకాలకు ప్లాన్‌

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారపర్వం సోమవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఇక అసలు పంపకాలపై దృష్టి సారించనున్నారు. కుల సంఘాలు, యూత్‌, మహిళా సంఘాలు, గ్రూపులవారీగా పంపకాలు జరిపేందుకు ప్లాన్‌ సిద్ధం చేసి పెట్టుకున్నారు.

కరీంనగర్‌ కార్పొరేషన్‌: వారంతా బంధువులు. ఒకే కులానికి చెందిన వివిధ పార్టీల నాయకులు. మున్పిపల్‌ ఎన్నికల్లో మాత్రం వైరివర్గాలుగా మారిపోయారు. ఆయా పార్టీల నుంచి కార్పొరేటర్‌ స్థానానికి పోటీపడుతున్నారు. నగరపాలకసంస్థలో సం్ఙకులశ్రీ సమరానికి వేదికగా మారింది 23వ డివిజన్‌. పోటీలో ఉన్న ప్రత్యర్థులంతా మున్నూరుకాపులు కావడమే ఆ డివిజన్‌ స్పెషల్‌. నగరంలోని 23వ డివిజన్‌ స్థానానికి మున్నూరు కాపు కులస్తులే పోటీపడుతున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ కార్పొరేటర్‌ జంగిలి సాగర్‌, బీజేపీ నుంచి పాదం శివరాజ్‌, కాంగ్రెస్‌ నుంచి గుమ్మడి రాజ్‌కుమార్‌, స్వతంత్ర అభ్యర్థిగా ఎడ్ల శ్రీనివాస్‌ పోటీలో ఉన్నారు. వీరంతా కూడా మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. పైగా బంధువులు కావడంతో ఆ డివిజన్‌ ప్రస్తుత ఎన్నికల్లో స్పెషల్‌గా మారింది. 1, 2, 36వ డివిజన్‌లలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. కాకపోతే 1వ డివిజన్‌లో ఐదుగురు అభ్యర్థులకు గాను నలుగురు, 2వ డివిజన్‌లో ఆరుగురిలో ఐదుగురు, 36వ డివిజన్‌లో ఏడుగురిలో ఆరుగురు మున్నూరుకాపులే పోటీలో ఉండడం విశేషం. నగరంలో ఈ సం‘కుల’ సమరం ఆసక్తి రేపుతోంది.

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ‘అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. మా ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందలేదు. మేము పన్నులుకట్టడం లేదా. మేం చెల్లించిన పన్నులు ఎక్కడికి వెళ్తున్నాయి. మీకు ఎందుకు ఓటు వేయాలి. మా ఇంటికి రాకండి’.. అంటూ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల వేళ ఓ ఇంటి యజమాని వినూత్న తరహాలో నిరసన తెలిపారు. కరీంనగర్‌ నగరపాలకసంస్థ 36వ డివిజన్‌లోని మారుతినగర్‌కు చెందిన కోటేశ్వర్‌ అనే వ్యక్తి తన ఇంటికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కాలనీలో చర్చనీయాంశంగా మారింది. తమ ప్రాంతంలో రోడ్లు బతికుండగానే నరకాన్ని చూపిస్తున్నాయని... మీకు ఎందుకు ఓటువేయాలంటూ ఆయన ఫ్లెక్సీ ద్వారా ప్రశ్నలు సంధించారు.

మున్సిపల్‌ పోరు.. నాన్‌వెజ్‌ జోరు

బంధువులే ప్రత్యర్థులు

● వేములవాడలో మాంసం మాయ 1
1/2

● వేములవాడలో మాంసం మాయ

● వేములవాడలో మాంసం మాయ 2
2/2

● వేములవాడలో మాంసం మాయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement