ఇప్పలపల్లిలో రాష్ట్రబృందం పర్యటన | - | Sakshi
Sakshi News home page

ఇప్పలపల్లిలో రాష్ట్రబృందం పర్యటన

Feb 9 2026 7:49 AM | Updated on Feb 9 2026 7:49 AM

ఇప్పలపల్లిలో రాష్ట్రబృందం పర్యటన

ఇప్పలపల్లిలో రాష్ట్రబృందం పర్యటన

ఇప్పలపల్లిలో రాష్ట్రబృందం పర్యటన

శంకరపట్నం: మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామాభివృద్ధిశాఖ బృందం సభ్యులు ఆదివారం పర్యటించారు. రాష్ట్రస్థాయిలో స్వయంసమృద్ధి వసతుల గ్రామపంచాయతీగా ఇప్పలపల్లి ఎంపికై ంది. ఈ మేరకు గ్రామంలో పర్యటించిన రాష్ట్రబృందం సభ్యులు గ్రామ పంచాయతీ భవనం, గ్రామైక్య మహిళా సంఘం భవనం, ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, నర్సరీ, పాడిపశువుల పెంపకం తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు.జాతీయస్థాయికి ఎంపికై తే రూ.50 లక్షల అవార్డు అందుతుందని పంచాయతీరాజ్‌, గ్రామాభివృద్ధిశాఖ అదనపు కమిషనర్‌ జాన్‌వెస్లీ తెలిపారు. డీపీవో జగదీశ్‌, ఎంపీడీవో కృష్ణప్రసాద్‌, ఎంపీవో ప్రభాకర్‌, సూపరింటెండెంట్‌ రఘువేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement